రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. నెల వ్యవధిలోనే రెండోసారి ఆర్బీఐకి బెదిరింపు రావడంతో పోలీసులు అలర్టయ్యారు. నవంబర్ 16న తొలిసారి బెదిరింపు మెసేజ్ రాగా.. మరోసారి గురువారం (డిసెంబర్ 12) మెసేజ్ రావడం గమనార్హం.
రష్యా భాషలో ఆర్బీఐ అఫీషియల్ వెబ్ సైట్ కు ఆర్బీఐని పేల్చేస్తామని మెయిల్ పంపారు దుండగులు. మాతా రమాబాయి అంబేడ్కర్ మార్గ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ముంబై పోలీసులు. సెండర్ వివరాలను ట్రేస్ చేసేందుకు ప్రయత్ని్స్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆర్బీఐ కి వరుస బెదిరింపులు వస్తుండటంతో ఆర్బీఐ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
- లష్కర్ ఇ తొయిబా సీఈవో నంటూ ప్రకటన
ఒక నెల వ్యవధిలో ఆర్బీఐకి ఆర్బీఐకి బెదిరింపు మెసేజ్ లు రావడం ఇది రెండవసారి. అయితే బెదిరింపు మెయిల్ పంపిన దుండగులు తాము లష్కర్ ఎ తొయిబా సీఈవో నంటూ క్లైమ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 2008లో ముంబయి అల్లర్లు సృష్టించిన లష్కరే గ్రూపు నుంచి మెయిల్ పంపినట్లు ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది.