
ఆర్బీఐ 2 వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ 97.82 శాతం 2 వేల నోట్లు తిరిగి వచ్చాయని ఆర్బీఐ ప్రకటించింది. ఇంకా 7,755 కోట్ల విలువైన 2 వేల నోట్లు ప్రజల దగ్గరే ఉన్నాయని తెలిపింది.
2023 మే 19న 2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అప్పటికే 3.56 లక్షల కోట్లు విలువైన 2 వేల నోట్లు సర్క్యూ లేషన్ లో ఉన్నాయి. అయితే మే 31, 2024 నాటికి అవి రూ.7,755 కోట్లకు తగ్గాయని ఆర్బీఐ ప్రకటించింది.
2 వేల నోట్లను డిపాజిట్ చేయడం లేదా మార్చుకునే సౌకర్యాన్ని దేశంలోని అన్ని బ్యాంక్ బ్రాంచ్ లలో 2023 అక్టోబర్ 7 వరకు అవకాశం ఇచ్చింది. 2023 అక్టోబర్ 9 నుంచి RBI ఇష్యూ కార్యాలయాలు 2 వేల నోట్లను వారి బ్యాంక్ ఖాతాలలో డిపాజిట్ చేయడానికి స్వీకరిస్తున్నాయని ఆర్బీఐ వెల్లడించింది. ఇంకా కొంత మంది పోస్ట్ ద్వారా 2 వేల నోట్లను పంపుతున్నారని వెల్లడించింది.
మరో వైపు అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా తిరువనంతపురంలో 19 ఆర్‌బిఐ కార్యాలయాల్లో డిపాజిట్ లేదా మార్పిడి చేస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది.
2016 లో వెయ్యి, 500 నోట్లను రద్దు చేసిన ఆర్బీఐ 2 వేల నోట్లను ప్రవేశ పెట్టింది. తర్వాత 2023 మే 19న వీటిని కూడా వెనక్కి తీసుకుంది.