భారీగా గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొంటున్న సెంట్రల్ బ్యాంకులు

భారీగా గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొంటున్న సెంట్రల్ బ్యాంకులు
  • భారీగా గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొంటున్న సెంట్రల్ బ్యాంకులు
  • ఈ ఏడాది మొదటి ఆరు  నెలల్లో 387 టన్నుల కొనుగోళ్లు
  • ఎక్కువగా కొన్నది చైనా..అమ్మింది టర్కీ
  • ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ దగ్గర 797.4 టన్నుల బంగారం

న్యూఢిల్లీ: వివిధ దేశాల్లోని సెంట్రల్ బ్యాంకులు గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విపరీతంగా కొంటున్నాయి.  ఈ ఏడాదిలోని మొదటి ఆరు నెలల్లో  ఏకంగా 387 టన్నుల  గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొనుగోలు చేశాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) పేర్కొంది. ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  మాత్రం కొనుగోళ్లు కొంత తగ్గాయని వెల్లడించింది. ఈ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సెంట్రల్ బ్యాంకులు 103 టన్నుల గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  కొనగా, కిందటేడాది జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొన్న 158.6 టన్నులతో  పోలిస్తే ఇది 35 శాతం తక్కువ. అదే క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆన్  క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకారం 64 శాతం  తక్కువ. మరోవైపు గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ది కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వదిలేసి) ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 6 శాతం (ఇయర్ ఆన్ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)  తగ్గిందని  డబ్ల్యూజీసీ రిపోర్ట్ పేర్కొంది.  
 
కిందటేడాది మొదటి ఆరు నెలల్లో  ఎక్స్చేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రేడెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఈటీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) లలోకి భారీగా  ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లోస్ వచ్చాయని, ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్లోస్ పెరిగాయని వెల్లడించింది.   ఓటీసీ, స్టాక్ ఫ్లోస్ కూడా కలుపుకుంటే ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో గోల్డ్ డిమాండ్ 5 శాతం పెరిగి 2,460 టన్నులకు చేరుకుందని డబ్ల్యూజీసీ రిపోర్ట్ పేర్కొంది. గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో నిలకడగా ఉందని వివరించింది.

ఆర్థిక పరిస్థితులు బాగోలేక.. 

 తుర్కియే ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడంతో ఈ దేశ సెంట్రల్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీసీఎంబీ ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  భారీగా గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అమ్మింది. ఫలితంగా జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంకులు కొనుగోలు చేసిన బంగారం తక్కువగా రికార్డయ్యిందని డబ్లూజీసీ రిపోర్ట్ వెల్లడించింది.  తుర్కియే ప్రభుత్వం బంగారం  దిగుమతులపై కొంత మేర రిస్ట్రిక్షన్లు పెట్టడంతో  టీసీఎంబీ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  నికరంగా 102 టన్నులను  అమ్మింది. కజకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (38 టన్నులు), ఉజ్బికిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (19 టన్నులు), కంబోడియా (10 టన్నులు), రష్యా (3 టన్నులు), జర్మనీ (2 టన్నులు), క్రోయేషియా (2 టన్నులు), తజికిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఒక టన్ను)  సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంకులు కూడా ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో నికర గోల్డ్ అమ్మకందారులుగా ఉన్నాయి.

బంగారాన్ని కొనుగోలు చేసిన  సెంట్రల్ బ్యాంకుల్లో   చైనా ఎక్కువగా అంటే 103 టన్నులు  కొనుగోలు చేసింది. వరుసగాఎనిమిదో నెలలో కూడా చైనా సెంట్రల్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బంగారాన్ని కొనుగోలు చేసింది. ఈ దేశ బంగారం నిల్వలు 2,133 టన్నులకు (మొత్తం గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 4 శాతానికి సమానం) చేరుకున్నాయి.  మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్  ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో నికరంగా 73  టన్నుల గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొనగా, నేషనల్ బ్యాంక్ ఆఫ్ పోలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 48 టన్నులు  కొనుగోలు చేసింది. ఇండియా సెంట్రల్ బ్యాంక్  ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ 10 టన్నుల గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  కొనుగోలు చేసింది. చెక్ రిపబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  (8 టన్నులు), ఫిలిప్పీన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (4 టన్నులు), ఇరాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (2 టన్నులు), యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (2 టన్నులు), ఖతర్ (2 టన్నులు)  నికర కొనుగోలుదారుల లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. 

ఇండియా గోల్డ్ రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

ఈ ఏడాది జూన్ నాటికి ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ దగ్గర గోల్డ్   797.4 టన్నులకు చేరుకుంది.   మరోవైపు ఈ  నెల 4 తో ముగిసిన వారంలో   గోల్డ్ రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు 224 మిలియన్ డాలర్లు తగ్గి 446.8 బిలియన్  డాలర్లుగా రికార్డయ్యాయి. మొత్తం ఫారెక్స్ నిల్వలు 2.41 బిలియన్ డాలర్లు తగ్గి 601.453కు పడ్డాయి.