హౌస్ లిస్టింగ్ పనులు స్పీడప్ చేయాలి : ఆర్డీవో పి.హరికృష్ణ

హౌస్ లిస్టింగ్ పనులు స్పీడప్ చేయాలి : ఆర్డీవో పి.హరికృష్ణ

బెల్లంపల్లి, వెలుగు: కుటుంబ సర్వే చేపట్టనున్న నేపథ్యంలో బెల్లంపల్లి మున్సిపాలిటీలో జరుగుతున్న హౌస్ లిస్టింగ్ పనులను స్పీడప్ చేసి ఈ నెల 5వ తేదీ లోగా పూర్తిచేయాలని ఆర్డీవో పి.హరికృష్ణ ఆదేశించారు. కుటుంబ సర్వేపై ఆదివారం పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్​లో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, స్టాఫ్​తో రివ్యూ నిర్వహించారు. హాజరైన ఆర్డీవో హౌస్ లిస్టింగ్ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్న సర్వేకు పట్టణంలోని ప్రజలు సహకరించాలని కోరారు. 

 మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో ఇంటి నెంబర్లు ఉన్న, లేని నివాసాలను  గుర్తించాలన్నారు. మున్సిపాలిటీలోని 34 వార్డుల్లో 130 మంది ఎన్యుమరేటర్లు, 12 మంది సూపర్ ​వైజర్లతో సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో మున్సిపల్ చైర్​పర్సన్ జక్కుల శ్వేత, పలువురు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, ఎన్యుమరేటర్లు, సూపర్​వైజర్లు పాల్గొన్నారు.