నెల్లికుదురు (కేసముద్రం), వెలుగు : కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో కాడిరకం అన్పాలిష్డ్ పసుపునకు రికార్డుస్థాయిలో రూ.10,301 ధర పలికింది. శుక్రవారం మార్కెట్కు రైతులు పసుపు తీసుకురాగా ఎలక్ట్రానిక్ నేషనల్అగ్రికల్చర్ మార్కెట్(ఈ-నామ్) విధానంలో నిర్వహించిన వేలంలో గరిష్ఠంగా రూ.10,301, కనిష్ఠంగా రూ.7,523.. సగటున రూ.10,301రేటుతో వ్యాపారులు కొన్నారు.
తట్టుపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్ 8 బస్తాల కాడిరకం పసుపు తీసుకురాగా, వేలంలో అత్యధికంగా రూ.10,301 రేటు దక్కింది. పదేండ్ల కింద అన్పాలిష్ట్ పసుపునకు క్వింటాకు రూ.10వేలు పలకగా. తర్వాత మళ్లీ ఆ రేటు నమోదు కాలేదు. రాబోయే రోజుల్లో మరింత రేటు పెరిగే అవకాశం ఉండొచ్చని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.