గోల్కొండలో రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

 గోల్కొండలో రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

హైదరాబాద్‎లో కుండపోత వర్షం కురిసింది. శనివారం రాత్రి దాదాపు గంటన్నర పాటు ఏకధాటిగా వాన పడింది. వరుణుడి బీభత్సంతో భాగ్యనగరం జలమైంది. వర్షం దంచికొట్టడంతో నగరంలోని రోడ్లు చెరువులను తలపించాయి. లో తట్టు ప్రాంతాలు జలమయం కాగా.. కొన్ని చోట్ల మోకాళ్ల లోతు వరకు నీరు రోడ్లపై నిలిచిపోయింది. ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షంతో నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. సిటీలోని ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో రోడ్లపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 

భాగ్యనగరాన్ని వర్షం ముంచెత్తడంతో ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. 

వెంటనే లో తట్టు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది సహయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై వాహనాల రద్దీని క్లియర్ చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‎తో పాటు రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. ఏ ఏ ఏరియాల్లో ఎంత వర్షపాతం నమోదు అయ్యిందనే గణాంకాలను విడుదల చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. భువనగిరిలో 10.3 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. తర్వాత హైదరాబాద్‎ గోల్కొండలో 9.1 సెం.మీ వర్షపాతం కురిసినట్లు అధికారులు వెల్లడించారు. 

ALSO READ :హైదరాబాద్ లో గంటకు పైగా కుండపోత వాన..చెరువులను తలపిస్తున్న రోడ్లు


ఏరియాల వారీగా నమోదైన వర్షపాతం వివరాలు:

  • గోల్కొండ 9.1 సెం. మీ
  • ఖైరతాబాద్ 8.6 సెం. మీ
  • ఆసిఫ్ నగర్ 8.0 సెం. మీ
  • నాంపల్లి 6.7 సెం. మీ
  • రాజేంద్ర నగర్ 6.6 సెం. మీ
  • హిమాయత్ నగర్ 6.5 సెం.మీ
  • సికింద్రాబాద్ 6.1 సెం. మీ
  • బహదూర్‎పుర 5.8 సెం.మీ
  • షేక్ పేట్ 5.9 సెం. మీ
  • కాప్రా 5.73 సెం. మీ
  • ముషీరాబాద్ 4.33 సెం. మీ