ODI World Cup 2023: వరల్డ్ కప్ ముందు రోహిత్ శర్మను ఊరిస్తున్న అరుదైన రికార్డ్

సాధారణంగా వరల్డ్ కప్ వస్తేనే భారత అభిమానులు పండగ  చేసుకుంటారు. ఇక భారత్ లోనే వరల్డ్ కప్ జరుగుతుంటే ఆ హైప్ మాములుగా ఉండదు. ఈ మెగా సమరానికి మరో మూడు రోజుల సమయం మాత్రమే  మిగిలి ఉంది. నేడు, రేపు ప్రాక్టీస్ మ్యాచులు జరుగుతాయి. ఇదిలా ఉండగా.. ఇప్పుడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వరల్డ్ కప్ లో ఒక అరుదైన రికార్డ్ కి చేరువలో ఉన్నాడు. ఇంతకీ ఆ రికార్డ్ ఏంటో ఇప్పుడు  చూద్దాం.
 
వన్డే వరల్డ్ కప్ హిస్టరీలో కొత్త రికార్డ్ సృష్టించడానికి రోహిత్ శర్మ రెడీ అయిపోయాడు. ఇప్పటివరకు వన్డే వరల్డ్ కప్ లో 17 ఇన్నింగ్స్ లు ఆడి 978 పరుగులు చేసిన హిట్ మ్యాన్.. మరో 2 ఇన్నింగ్స్ ల్లో 22 పరుగులు చేస్తే వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాటర్ గా అరుదైన ఘనత సాధిస్తాడు. ఈ  లిస్టులో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్, దక్షిణాఫ్రికా మాజీ స్టార్ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ ఉన్నారు. వీరిద్దరూ కూడా 1000 పరుగుల మైలురాయిని చేరుకోవడానికి 20 ఇన్నింగ్స్ లు అవసరమయ్యాయి. 

కాగా.. 2019 వరల్డ్ కప్ లో వరుసగా రోహిత్ శర్మ 5 సెంచరీలు  కొట్టిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో మొత్తం 9 ఇన్నింగ్స్ లు ఆడిన రోహిత్.. 81 సగటుతో 648 పరుగులు చేసాడు. 2015 లో బంగ్లాదేశ్ పై జరిగిన మ్యాచులో కూడా రోహిత్ సెంచరీ బాదేశాడు. ఇప్పటికే వన్డేల్లో ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్న రోహిత్ ఈ రికార్డ్ అందుకుంటాడో లేదో చూడాలి.