
ములుగు, వెలుగు : ములుగు మండలం జాకారం గ్రామానికి చెందిన రేకులపెల్లి రాజేశ్ కు నేషనల్ ప్రీమియం అవార్డు లభించింది. ఫొటో గ్రఫీఫీల్డ్లో రాణిస్తున్న రాజేశ్ బెస్ట్ఎడిటర్, బెస్ట్ డైరెక్టర్ఆఫ్ ఫొటోగ్రఫీ విభాగంలో ఈ అవార్డు లభించగా, ఆదివారం హైదరాబాద్లో జరిగిన నేషనల్ ప్రీమియం అవార్డు - 2025 లో హైకోర్టు రిటైర్డ్ జడ్జి చంద్ర కుమార్, జబర్దస్త్ కమెడియన్ షేకింగ్ శేషు, సంస్థ ఫౌండర్పరిపెల్లి రవిశ్రీ, గౌరీశ్రీ చేతులమీదుగా అవార్డు అందుకున్నారు.