న్యూఢిల్లీ: ఒక్కో షేరుకి ఒక షేరుని (1: 1) బోనస్‌గా ఇవ్వడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు గురువారం ఆమోదం తెలిపింది. గత ఏడేళ్లలో కంపెనీకిదే మొదటి బోనస్ ఇష్యూ. చివరిసారిగా 2017 సెప్టెంబర్‌లో 1:1 బోనస్ షేర్లను, అంతకు ముందు 2009 లో 1: 1 రేషియోలో బోనస్ షేర్లను ఇష్యూ చేసింది. ‘రూ.10 ఫేస్ వాల్యూ ఉండే ఒక ఫుల్లీ పెయిడప్ ఈక్విటీ షేరుకి ఒక ఫుల్లీ పెయిడప్ ఈక్విటీ షేరుని ఇష్యూ చేయడానికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది’ అని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ పేర్కొంది.
దీంతోపాటు అథరైజ్డ్ షేర్ క్యాపిటల్‌ను రూ.15 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్లకు పెంచడానికి షేర్ హోల్డర్లు అనుమతి ఇచ్చారు. రిలయన్స్ షేరు గురువారం 1.26 శాతం తగ్గి రూ. 2,991 దగ్గర క్లోజయ్యింది.