Good Health: మైగ్రేన్​ మహమ్మారి నుంచి ఇలా ఉపశమనం పొందండి..

Good Health: మైగ్రేన్​ మహమ్మారి నుంచి ఇలా ఉపశమనం పొందండి..

మైగ్రేన్‌లను తరచుగా ఇతర తలనొప్పులుగానూ పరిగణిస్తాం. ఒక్కోసారి తలనొప్పి లక్షణాలు ఊహకందవు. అవి ముదిరి న్యూరలాజికల్ సమస్యగానూ మారతాయి. మైగ్రేన్​  తలనొప్పి వలన  తలలో ఒక వైపు నొప్పితో పాటు, వికారం, వాంతులు ఉంటాయి . మహిళల్లో, మైగ్రేన్‌నొప్పికి  హార్మోన్ల అసమతుల్యత. ఈస్ట్రోజెన్ స్థాయిలలో హెచ్చుతగ్గుల వల్ల, ముఖ్యంగా ఋతుస్రావానికి ముందు లేదా సమయంలో అస్వస్థత ఏర్పడుతుంది.

  కొన్ని మందులు, ఆల్కహాల్..  అధిక కెఫిన్ తీసుకోవడం  మైగ్రేన్‌ను ప్రేరేపిస్తాయి. మైగ్రేన్ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు తరచుగా NSAIDS మరియు ఎసిటమినోఫెన్ వంటి నొప్పి నివారణ మందులను వాడాలి.  ఉపయోగిస్తుండగా,  జీవనశైలి మార్పులులతో ..  మైగ్రేన్ నొప్పిని తగ్గించుకోవడానికి నిపుణులు సూచిస్తున్న సలహాలను తెలుసుకుందాం. . .

ప్రశాంత వాతావరణం.. విశ్రాంతి: తల నొప్పి ఎంత తీవ్రంగా ..  మైగ్రేన్లు వచ్చినప్పుడు  విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం.  కళ్లుమూసుకొని పడుకోవాలి.  చాలా సైలంట్​ గా ఉండాలి. ఒక్కోసారి  వాంతులు కూడా  సంభవిస్తాయి. ఆ సమయంలో  కొద్ది కొద్దిగా  నీటి తీసుకొని  హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. . ఇలా చేస్తే  నొప్పి నుండి  ఉపశమనం కలుగుతుంది

నిద్ర : కొంతమందికి రాత్రిపూట నిద్ర లేకపోవడం వల్ల మైగ్రేన్​ పెయిన్​ వస్తుంది.  దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు  స్లీపింగ్​ టైమింగ్స్​ పాటించాలి. పగలు  నిద్రపోకుండా ఉంటే మంచిది.   నిద్రపోయే ముందు ప్రశాంతమైన సంగీతం..  పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఒత్తిడి :   మైగ్రేన్​ తల నొప్పికి ఒత్తిడి కూడా ఒక కారణం.  కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవాలి.  నొప్పి నుండి ఉపశమనం పొందడానికి  మనస్సు ప్రశాంతంగా ఉండాలి.  వాకింగ్​ చేయాలి. నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. 

 వ్యాయామం : వ్యాయామం చేసేటప్పుడు మెడడు కణాలపై స్ట్రెస్​ పడకుండా చేయాలి.  నొప్పి సంకేతాలను నిరోధించే రసాయనాలను విడుదల చేస్తుంది.ఇవి మైగ్రేన్‌లను మరింత తీవ్రతరం చేస్తుంది. 

ఆహారం:  మైగ్రేన్ నొప్పితో ఇబ్బంది పడే వారు టైం ప్రకారం భోజనం చేయాలి.  పొట్ట ఖాళీగా ఉంటే నొప్పి వపస్తుంది.  నిల్వ ఉన్న ఆహార పదార్దాలను తినకూడదు.  చాక్లెట్​.. కెఫిన్​ లాంటి వస్తువులను  తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

►ALSO READ | ఆధ్యాత్మికం : డబ్బు..సంపద ఉంటేనే గౌరవం.. సన్మానాలు