ఆక్రమణల తొలగింపును ఓల్డ్​ సిటీ నుంచి మొదలు పెట్టాలి

ఆక్రమణల తొలగింపును ఓల్డ్​ సిటీ నుంచి మొదలు పెట్టాలి
  • ఖైరతాబాద్​ ఎమ్మెల్యే దానం నాగేందర్

బషీర్ బాగ్, వెలుగు: అధికారులకు చిత్తశుద్ధి ఉంటే పాతబస్తీ నుంచి ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపు మొదలుపెట్టాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ డిమాండ్​చేశారు. గురువారం ఆయన ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా దానం మాట్లాడుతూ.. ఆక్రమణల తొలగింపులో అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పేదల జీవనాధారాన్ని దెబ్బతీయడం కరెక్ట్​కాదని చెప్పారు. అధికారుల పనులతో తాము జనంలో తిరగలేకపోతున్నామని, పబ్లిక్ నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడం కరెక్ట్​కాదన్నారు. పాతబస్తీలోని అక్రమ నిర్మాణాలు అధికారులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 

తాను హైదరాబాద్​లోనే పుట్టి పెరిగిన వాడినని, సిటీ ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఉండలేనన్నారు. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే ప్రభుత్వాలకు మనుగడ ఉండదన్నారు.చెరువులను కాపాడేందుకు తీసుకొచ్చిన హైడ్రానుస్వాగతిస్తున్నామన్నారు. మాదాపూర్ లో ఫుట్ పాత్​పై ఉన్న కుమారి ఆంటీ షాపును తొలగించినప్పుడు సీఎం స్పందించి మినాయింపు ఇచ్చారని, అవే ఆదేశాలను ఖైరతాబాద్​చింతల్​బస్తీలోనూ పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.