హైదరాబాద్, వెలుగు: వర్కింగ్ ప్రొఫెషనల్స్, చిన్న వ్యాపారాల యజమానుల కోసం ఇన్సూర్టెక్ సంస్థ రెన్యూబయ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. నెల ప్రీమియం రూ.2,500 నుంచి మొదలవుతుంది. డెత్ బెనిఫిట్, తీవ్రమైన అనారోగ్య ప్రయోజనం, వైకల్యం వస్తే ప్రీమియం మినహాయింపు వంటి ప్రత్యేకతలు ఈ పాలసీలో ఉంటాయి.
ఎల్ఐసీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, డిజిట్ ఇన్సూరెన్స్ సహకారంతో దీనిని ప్రవేశపెట్టామని రెన్యూబయ్ తెలిపింది. 10 ఏళ్ల పే ఆప్షన్‌తో జీవితాంతం లేదా 80 ఏళ్లు వచ్చే వరకు కవరేజీ ఉంటుంది. సమ్అష్యూర్డ్మొత్తం రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటుంది.