
రేగొండ, వెలుగు: భూపాలపల్లి జిల్లాలో బీఆర్ఎస్ బ్లాక్ మెయిల్రాజకీయాలకు భయడమని భూపాలపల్లి మార్కెట్‌కమిటీ చైర్మన్గూటోజు కిష్టయ్య పేర్కొన్నారు. ఆదివారం జయశంకర్భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. తమ పార్టీ తరుఫున సంక్షేమ పథకాల పేర్లను వాల్ రైటింగ్వేస్తున్న పెయింటర్ దార్ల ఓంశంకర్ను భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శనివారం బెదిరింపులకు గురి చేయడం సిగ్గు చేటన్నారు.
తమ పార్టీ పెయింటర్ రిజర్వు చేసిన గోడలకు బీఆర్ఎస్ ప్రచార రైటింగ్వేయడమే కాకుండా సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారం చేయడం హేయమైన చర్య అన్నారు. ఇప్పటికైనా గుండా రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు ఇప్పకాయల నర్సయ్య, నాయకులు బొజ్జం రవి, మూల్కనూరి భిక్షపతి, జంగటి సుధాకర్, మేకల భిక్షపతి, పున్నం రవి తదితరులు పాల్గొన్నారు.