
డబ్ల్యూఆర్‌సీబీ టీవీ వార్తా ఛానెల్‌లో ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. అనుకోకుండా ఈ సన్నివేశం జరగడంతో ఇది ప్రత్యక్ష ప్రసారం కూడా అయింది. NBC అనుబంధ WRCB-TVకి న్యూస్ యాంకర్ అయిన కార్నెలియా నికల్సన్ రోజూ లాగే ముఖ్యాంశాలను అందించడంలో బిజీగా ఉన్నారు. జాతీయ, అంతర్జాతీయ వార్తలు చదువుతున్న తనకు... మరి కొద్ది సేపట్లో తాను కూడా ఓ వార్త కాబోతుందని ఆమె ఊహించలేకపోయింది. ప్రేక్షకులు ఈ లైవ్ టెలికాస్టింగ్ ను ఆసక్తిగా తిలకిస్తుండగా.. ఒక్కసారిగా ఆశ్చర్యాన్ని చూశారు. కార్నెలియా బాయ్‌ఫ్రెండ్, తోటి జర్నలిస్ట్ రిలే నాగెల్ తన చేతిలో బొకే, ఉంగరంతో సెట్‌లో కనిపించాడు.
రిలే నాగెల్ తమ పరిచయాన్ని, ఆ తర్వాత జరిగిన విషయాలను వెల్లడిస్తూ తన హృదయపూర్వక పదాలతో ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించాడు. “నేను చాలా ప్రత్యేకమైన నివేదికను కలిగి ఉన్నాను. ఇంట్లో ఎవరికి తెలియదు, కార్నెలియా, నేను దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం మోంటానాలో ఒక వార్తా స్టేషన్‌లో కలుసుకున్నాం. నేను మిమ్మల్ని మొదటిసారి కలిసినప్పుడు, నేను మీ పట్ల చాలా ఆకర్షితుడయ్యాను. మీరు చాలా అద్భుతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారు. మీరు చాలా ప్రకాశవంతంగా ఉంటారు, మీరు అందరినీ నవ్విస్తారు "అని అతను చెప్పాడు. ఆ తర్వాత కార్నెలియాను ఆమె ప్రియుడు "నన్ను పెళ్లి చేసుకుంటావా" అని అడిగాడు. అతని మాటలకు ప్రతిస్పందిస్తూ, కార్నెలియా నికల్సన్ ప్రతిపాదనను అంగీకరించి, "అవును" అని చెప్పింది. ఆ తర్వాత ఇద్దరూ ఒకరినొకరు ముద్దుపెట్టుకుని కౌగిలించుకున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఇదంతా కూడా ఛానెల్ లో లైవ్ లో ప్లే అయింది.
ఈ వీడియో ఇంటర్నెట్‌లో కనిపించిన వెంటనే, సోషల్ మీడియా యూజర్స్.. వారి ఆనందంలో పాలు పంచుకోవడం మొదలుపెట్టారు. వారిద్దరికీ అభినందనలు తెలుపుతూ కామెంట్ల రూపంలో వీరిద్దరిపై ప్రేమ వర్షం కురిపించారు. ఇది చూడడానికి చాలా బాగుందని.. అతను ఆమెను ఆశ్చర్యపరిచే అద్భుతమైన పని చేశాడు.. అతను చాలా భయాందోళనకు గురయ్యాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని కొందరు కామెంట్ చేశారు. నాకు అతని లాంటి వ్యక్తి కావాలి అంటూ ఇంకొకరు తమ భావాలను పంచుకున్నారు. ఈ వీడియో రెండు రోజుల క్రితం Majically News.. ఇన్ స్టాలో షేర్ చేయగా.. దీనికి 18వేలకు పైగా వ్యూస్, 2లక్షల కామెంట్స్ వచ్చాయి.