ట్రంప్ ఎలక్షన్​ టీమ్ ఈ మెయిల్స్ హ్యాక్! ఇరాన్​ పనేనని ట్రంప్‌‌‌‌ ​బృందం ఆరోపణ

ట్రంప్ ఎలక్షన్​ టీమ్ ఈ మెయిల్స్ హ్యాక్! ఇరాన్​ పనేనని ట్రంప్‌‌‌‌  ​బృందం ఆరోపణ

వాషింగ్టన్​: తమ ఈ మెయిళ్లు హ్యాక్​అయ్యాయని అమెరికా మాజీ అధ్యక్షుడు, రిప్లబికన్​పార్టీ అభ్యర్థి డొనాల్డ్​ట్రంప్​ ఎలక్షన్​క్యాంపెయినింగ్​టీం పేర్కొంది. ఇది ఇరాన్​ నటుల పనేనని ఆరోపించింది. తమ సున్నితమైన ఇంటర్నల్​డాక్యుమెంట్స్​ను దొంగిలించి, బహిర్గతం చేశారని తెలిపింది. అయితే ఇందులో ఇరాన్​ పాత్ర ఉందనేందుకు కచ్చితమైన ఆధారాలను మాత్రం ట్రంప్‌‌‌‌ బృందం వెల్లడించలేదు.  

2024లో అమెరికా ప్రెసిడెన్షియల్​ ఎలక్షన్స్​లో ఫారిన్​ ఏజెంట్లు చొరబడ్డారని టెక్​కంపెనీ మైక్రోసాఫ్ట్​ ఆరోపించింది. ముఖ్యంగా ట్రంప్‌‌‌‌ను లక్ష్యంగా చేసుకొని ఇరాన్‌‌‌‌ సైబర్‌‌‌‌ దాడులకు పాల్పడుతున్నదని ఓ నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక విడుదలైన మరుసటిరోజే తమ ఈమెయిల్స్​ హ్యాక్​ అయినట్టు  ట్రంప్‌‌‌‌ ప్రచార బృందం నుంచి ప్రకటన వెలువడింది. 

అమెరికా విదేశాంగ శాఖ స్పందన

ట్రంప్ టీమ్​ ఆరోపణలపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది. తమ దేశ ఎన్నికల్లో విదేశీ జోక్యాన్ని అతి తీవ్రంగా పరిగణిస్తున్నట్టు పేర్కొన్నది. ఇలాంటి వాటిని సహించబోమని తేల్చి చెప్పింది. తమ ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపర్చేందుకు చేసే ఎలాంటి కార్యకలాపాలనైనా తిప్పికొడతామని పేర్కొంది.