పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీ బాట పట్టారు. ఆయన జూన్ 25వ తేదీ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులకు రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ ఖరారు కావడంతో రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు.
ఇవి కూడా చదవండి: కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ ప్రతినెల పాకెట్ మనీ ఇస్తుండు : బండి సంజయ్
జూన్ 26వ తేదీ ఉదయం 11 గంటలకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కలవనున్నారు. వీరితోపాటు ఉమ్మడి ఖమ్మం మహబూబ్ నగర్‌కు చెందిన ముఖ్య లీడర్లలో 40 మంది కూడా ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాత పొంగులేటి, జూపల్లిలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీలను కూడా కలవనున్నారు. పార్టీలో చేరికల తేదీ, బహిరంగ సమావేశాలు వంటి అంశాలపై రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి, జూపల్లి, పొంగులేటి చర్చించనున్నారు.