రివ్యూ: సర్కారు వారి పాట

రివ్యూ: సర్కారు వారి పాట
రన్ టైమ్ : 2 గంటల 40 నిమిషాలు
నటీనటులు: మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్ర ఖని, వెన్నెల కిషోర్,
సుబ్బరాజు, నదియా, తనికెళ్ల భరణి, నాగబాబు, పోసాని, తదితరులు
సినిమాటోగ్రఫీ: మధి
మ్యూజిక్: తమన్
నిర్మాతలు: మైత్రీ మూవీస్,14 రీల్స్
రచన,దర్శకత్వం: పరశురామ్ పెట్ల

రిలీజ్ డేట్: మే 12,2022

స్టోరీ..

సర్కారు వారి పాట కథేంటంటే బ్యాంకులో తీసుకున్న లోన్ కట్టలేక తన తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటారు. ఆ సంఘటనతో డిస్టర్బ్ అవుతాడు మహి(మహేష్ బాబు). అప్పు చేయని వాడు స్ట్రాంగ్ అయితే .. ఇచ్చిన అప్పును తిరిగి వసూలు చేసుకునే వాడు ఇంకా స్ట్రాంగ్ అన్న పెద్ద వాళ్ల మాట విని బాగా చదువుకొని ఫారిన్ వెళ్లి అక్కడ వడ్డీ వ్యాపారం చేస్తాడు. డబ్బులు ఇవ్వకుంటే మాత్రం కొట్టి మరీ వసూల్ చేసుకుంటాడు. కానీ కళావతి (కీర్తిసురేష్) అబద్దాలు చెప్పి మహిని ట్రాప్ చేపి అప్పు చేస్తుంది. డబ్బులడిగితే తన తండ్రి పేరు చెప్పి బెదిరిస్తుంది. ఆమె తండ్రితో ఫైట్ చేసి ఆ డబ్బులు ఎలా వసూలు చేసుకున్నాడు. తాను ఇండియా వచ్చిన రీజన్ ఏంటి అనేది కథ.

సర్కారు వారి పాట మెయిన్ పాయింటేంటంటే ధనవంతులు వేల కోట్ల లోన్లు తీసుకొని ఎగ్గొట్టడం వల్ల ఆ భారాన్ని బ్యాంకులు సామాన్యుల మీద వేసిప్రెషర్ చేస్తున్నాయి. దాని వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారనేది మెయిన్ కథ. నిజానికి ఇది మంచి పాయింట్. పెద్ద డైరెక్టర్లియితే దీన్ని బాగా హ్యాండిల్ చేసేవారు. కానీ పరశురామ్ సరిగా తీయలేకపోయాడు. ఇలాంటి కథ ప్రేక్షకులను ఎమోషనల్ గా కనెక్ట్ చేసేవిధంగా ఉండాలి. కానీ తెరమీద ఏదో ఫ్లాట్ గా జరుగుతూ ఉంటుంది కానీ.. ఏ కోశానా లోన్ తీసుకొని ఎగ్గొట్టినోళ్ల మీద పెద్దగా కోపం రాదు. అంతే కాదు. వాళ్ల బకాయిలను వసూలు చేసే హీరోకు ఎలాంటి పవర్స్ ఉండవు. వాళ్ల తల్లిదండ్రులు చనిపోయారు అనే చిన్న ఎమోషనల్ పాపాయింట్ తప్ప. ఒక సామాన్యుడు పెద్ద స్థాయి పలుకుబడి ఉన్న ఓ ఎంపీతో అవలీలగా ఫైట్ చేస్తాడు. తన ఇంటి మీదకు లారీతో తొక్కుకుంటూ వెళ్లి నోటీస్ ఇస్తాడు. అవన్నీ లాజిక్ లెస్ గా ఉన్నాయి. ఈ ఎమ్.ఐ ల వల్ల ఇక రైతులు, సామన్యులు చనిపోతున్నారు అంటాడు కానీ, రైతుల ఆత్మహత్యల కష్టాల గురించి ఎక్కడా చూపించలేదు డైరెక్టర్. హీరోకు కూడా ఓ పవర్ ఉన్న ఆఫీసర్ లాగా చూపించి ఉంటే లాజికల్ గా ఉండేది.  ఫస్టాఫ్ లో హీరోహీరోయిన్ మధ్య ట్రాక్ ఎంటర్ టైనింగ్ గా ఉంది. కానీ సెకండాఫ్ లో సుబ్బరాజు, కీర్తిసురేష్, మహేష్ ల మధ్య సిల్లీ కామెడీ సీన్ అస్సలు బాగాలేదు. అలాగే కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు కూడా ఇబ్బందిగా ఉంటాయి. 

ఎవరెలా చేశారంటే..

మహేష్ బాబు తన స్క్రీన్ ప్రజెన్స్ తో ,పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది. కీర్తిసురేష్ బ్యూటిఫుల్ గా ఉంది. కానీ సెకండాఫ్ కు వచ్చేసరికి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. సముద్రఖని విలన్ పాత్రలో రాణించాడు. వెన్నెల కిషోర్, సుబ్బరాజులు కొన్నిసార్లు నవ్వించారు. మధి సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. తమన్ ఇచ్చిన పాటల్లో రెండు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాను బాగా లేపాడు. ప్రొడక్షన్ వాల్యూయ్స్ గ్రాండ్ గా ఉన్నాయి. ఎడిటింగ్ బాగుంది. యాక్షన్ ఎపిసోడ్ ఆకట్టుకుంటాయి. పరశురామ్ రాసుకున్న డైలాగులు కొన్ని బాగా పేలాయి. ఓవరాల్ గా ‘‘సర్కారు వారి పాట’’ మంచి స్పాన్ ఉన్న కథ అయినా.. ఫ్లాట్ స్క్రీన్ ప్లే వల్ల రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా సరిపెట్టుకుంది. మంచి కథనం, కొన్ని ఎమోషనల్ కనెక్టింగ్ ఎపిసోడ్స్ పెట్టిఉంటే  మరో రేంజ్ సినిమా అయ్యేది. ఫ్యాన్స్ వరకు ఎంజాయ్ చేస్తారు కానీ డబ్బులు,టైమ్ పెట్టి వెళ్లిన సగటు ప్రేక్షకుడు మాత్రం యావరేజ్ సినిమా అని ఫీలవుతాడు.

బాటమ్ లైన్: మొండి బకాయి

 

ఇవి కూడా చదవండి

మాజీ పంచాయితీ అధికారి ఇంట్లో భారీగా ఆస్తుల గుర్తింపు

వీడియో: కదులుతున్న రైల్లో నుంచి పడబోతుంటే..