IND vs BAN 2024: అంచనా తప్పింది: రోహిత్, సిరాజ్‌కు పంత్ క్షమాపణలు

చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఫాస్ట్ బౌలర్ సిరాజ్ ను వికెట్ కీపర్ పంత్ నిరాశకు గురి చేశాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో జాకీర్ హసన్ కు సిరాజ్ ఐదో బంతిని లెగ్ సైడ్ దిశగా విసిరాడు. బంతి ప్యాడ్లకు తాకడంతో అంపైర్ కు అప్పీల్ చేయగా.. నాటౌట్ గా ప్రకటించాడు. దీంతో భారత్ రివ్యూకు వెళ్లాలా వద్దా అనే అనుమానంలో పడింది. ఈ దశలో కెప్టెన్ రోహిత్ శర్మ రివ్యూ విషయంలో పంత్ ను కోరాడు.  బంతి లెగ్ స్టంప్ మిస్ అవుతుంది.. రివ్యూ వద్దని పంత్ చెప్పాడు. మరోవైపు సిరాజ్ డీఆర్ఎస్ వైపు ఆసక్తి చూపించాడు. 

రోహిత్ పంత్ మాట విని డీఆర్ఎస్ తీసుకోలేదు. అయితే రీప్లేలో మాత్రం బంతి పిచ్ ఇన్ లైన్ లో పడినట్లు చూపించడంతో పాటు వికెట్లను కూడా తగులుతుంది. దీంతో రివ్యూ తీసుకోనందుకు సిరాజ్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. రోహిత్ చిరు నవ్వు నవ్వగా.. పంత్ రివ్యూ వద్దు అని చెప్పినందుకు రోహిత్, సిరాజ్ కు క్షమాపణలు తెలిపాడు. రివ్యూ తీసుకోకపోయినా భారత్ కు పెద్ద నష్టం జరగలేదు. ఇన్నింగ్స్ 9 ఓవర్లో కేవలం 3 పరుగుల వద్ద ఆకాష్ దీప్ జాకీర్ హసన్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 

Also Read:-ఆకాష్ హ్యాట్రిక్ మిస్.. 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన బంగ్లా

ఈ మ్యాచ్ విషయానికి వస్తే బంగ్లాదేశ్ తమ మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 40 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. బుమ్రా తొలి ఓవర్ లోనే ఇస్లాం (2) ను క్లీన్ బౌల్డ్ చేయగా.. ఇన్నింగ్స్ 9 ఓవర్ ఆకాష్ దీప్ తొలి బంతికి జాకీర్ హసన్ (3) ను.. రెండో బంతికి మోమినల్ (0) హక్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. లంచ్ తర్వాత సిరాజ్ బంగ్లా కెప్టెన్ శాంటో (20) ను పెవిలియన్ కు పంపగా.. ఫామ్ లో ఉన్న రహీమ్ (8) ను బుమ్రా ఔట్ చేశాడు.