టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయం అందరినీ షాక్ కు గురిచేసింది. అప్పటివరకు అద్భుతమైన ఫామ్ లో ఉన్న పంత్.. అకస్మాత్తుగా యాక్సిడెంట్ కావడంతో ఈ స్టార్ బ్యాటర్ ఈ ఏడాది బ్యాట్ పట్టనే లేదు. ఈ క్రమంలో ఐపీఎల్, డబ్ల్యూటీసీ ఫైనల్ తో పాటు స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీ కూడా మిస్ అయ్యాడు. అయితే పంత్ త్వరలోనే జాతీయ జట్టులోకి రానున్నట్లు తెలుస్తుంది. తాజా సమాచార ప్రకారం పంత్ టీమిండియాలోకి ఎప్పుడు వస్తాడనే విషయంలో ఒక క్లారిటీ వచ్చేసింది.
టీమిండియా అభిమానులకి గుడ్ న్యూస్. పంత్ త్వరలోనే టీమిండియాలోకి అడుగు పెట్టబోతున్నాడు. గాయం నుంచి కోలుకున్న పంత్ ప్రస్తుతం ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టాడు. పంత్ పూర్తి ఫిట్ నెస్ సాధించడానికి మరి కొంత సమయం పట్టేలా కనిపిస్తుందని సమాచారం. నివేదికల ప్రకారం రిషబ్ పంత్ విజయ్ హజారే ట్రోఫీ లేదా రంజీ ట్రోఫీలో ద్వారా దేశవాళీ క్రికెట్ లో అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రకారం వచ్చే ఏడాది ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ ద్వారా పంత్ రీ ఎంట్రీ ఇవ్వొచ్చని తెలుస్తుంది.
ALSO Read :- టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బంగ్లాదేశ్.. పాక్ జట్టులో భారీ మార్పులు
ప్రస్తుతం వరల్డ్ కప్ ఆడుతున్న భారత్.. ఈ మెగా టోర్నీ తర్వాత ఆస్ట్రేలియాతో 5 టీ 20 ల సిరీస్ ఆడబోతుంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే దక్షిణాఫ్రికా పర్యటనకు బయలు దేరుతుంది. ఇక 11 జనవరి నుంచి ఆఫ్ఘనిస్తాన్ తో 3 టీ 20 ల సిరీస్ ఆడాల్సి ఉంది. అంతా అనుకున్నట్టు జరిగితే ఈ సిరీస్ లో పంత్ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. ఇంగ్లాండ్ తో ఫిబ్రవరిలో 5 టెస్టులు ఉన్న నేపథ్యంలో పంత్ ఈ సిరీస్ కు సిద్ధంగా ఉంచాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం.