మేడిగడ్డలో కుంగిన పిల్లర్లకు ప్రమాదం లేకుండా రిపేర్లు 

కుంగిన మేడిగడ్డ బ్యారేజీకి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఆపరేషన్‌‌ అండ్‌‌‌‌ మెయింటెనెన్స్‌‌‌‌లో భాగంగా పనులు చేపట్టాలని కాంట్రాక్ట్‌‌‌‌ సంస్థ ఎల్అండ్​టీకి ఇరిగేషన్​ శాఖ ఆదేశాలిచ్చింది. వచ్చే వానాకాలంలో గోదావరికి వరద వస్తే ఏడో బ్లాక్​లోని పిల్లర్లు మరింత లోపలికి కుంగకుండా పనులు చేపట్టాలని సూచించింది. 

కుంగిన పిల్లర్లకు ప్రమాదం లేకుండా..  

ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈఎన్సీ (జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) అనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేతృత్వంలో ఈ నెల 11న హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరిగింది. మేడిగడ్డ బ్యారేజీకి చేపట్టాల్సిన తాత్కాలిక రిపేర్లపై ఇందులో చర్చించారు. కుంగిన ఏడో బ్లాక్ చుట్టూరా అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్ట్రీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సుమారు 220 మీటర్ల దూరం షీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పైల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేయాలని కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థను ఈఎన్సీ ఆదేశించారు. దీనివల్ల బ్యారేజీలో వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టోరేజీ చేసినా కుంగిన పిల్లర్లకు ఎలాంటి  ప్రమాదం ఉండదని సూచించారు. ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెయింటెనెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా ఈ పనులు చేపట్టాలని కోరారు. ఈ పనులు చేయడానికి రూ.200 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేసిన ఎల్అండ్ టీ.. ఇప్పటికే చేసిన పనులకు సంబంధించి రూ.300 కోట్లకు పైగా పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిల్లులు ఉన్నాయని, వాటిని క్లియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని కోరినట్టు తెలిసింది. 

ఫ్రీ ఫ్లో ఉండాలన్న నిపుణులు..

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో ప్లానింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డిజైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, క్వాలిటీ ఏదీ సక్కగ లేదని నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేప్టీ అథారిటీ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ) నిర్ధారించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందజేసింది. పోయినేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 22 నుంచి 24 వరకు ఆరుగురు సభ్యులతో కూడిన ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ నిపుణుల బృందం రాష్ట్రంలో పర్యటించింది. కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేతృత్వంలో బ్యారేజీని పరిశీలించి, ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజినీర్లతో రెండ్రోజులు సమీక్షలు నిర్వహించింది. పర్యటన ముగిసిన 10 రోజుల తర్వాత మధ్యంతర రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. కుంగిన ఏడో బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని 11 పిల్లర్లను పునాదులతో సహా తొలగించాలని అందులో స్పష్టం చేసింది.

ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 19న స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేఫ్టీ అథారిటీ (ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ) టెక్నికల్​టీమ్ బ్యారేజీని​పరిశీలించింది. వర్షాకాలంలోపు మేడిగడ్డ బ్యారేజీ నుంచి వాటర్ ఫ్రీ ఫ్లో అయ్యేలా చేయకపోతే 7వ బ్లాక్ లోని పిల్లర్లు పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇక చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యర్ నేతృత్వంలోని  ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ మార్చి 7, 8 తేదీల్లో బ్యారేజీని పరిశీలించింది. ఇది ఇంకా ప్రభుత్వానికి రిపోర్టు అందించలేదు. కాగా, ఎస్​డీఎస్ఏ సూచనల మేరకు ఫ్రీ ఫ్లో జరిగేలా ప్రస్తుతం పనులు చేస్తామని కాళేశ్వరం ఇంజినీర్లు అంటున్నారు. ఆపై పిల్లర్లు మరింత కుంగకుండా ఉంటే కొద్దిపాటి నీళ్లను నిల్వ చేసి లిఫ్ట్​ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు పేర్కొన్నారు.