ది రోబో వెయిట్రెస్..రెస్టారెంట్లో చక్కగా వడ్డిస్తోంది 

ది రోబో వెయిట్రెస్..రెస్టారెంట్లో చక్కగా వడ్డిస్తోంది 

మనం ఏదైనా హోటల్, రెస్టారెంట్లకు వెళితే  మనకు సర్వ్ చేసేందుకు వెయిటర్స్ కనిపిస్తుంటారు. వెయిటర్ అని పిలువగానే వచ్చి..ఏం కావాలి సర్.. అర్డర్ తీసు కొని సర్వ్ చేస్తారు..అయితే ఇప్పుడు మనకు సర్వ్ చేసేందుకు రోబో వెయిట్రెస్ లు వచ్చేస్తున్నాయి.  అమెరికాలోని ఓ జపనీస్ హోటల్ లో రోబో వెయిట్రెస్ లు చక్క గా ఆర్డర్ తీసుకొని కావాల్సిన ఆహార పదార్ధాలను వడ్డిస్తున్నాయి. వంగి వంగి నమస్కారం చేస్తున్నాయి.  ఈ రోబో వెయిట్రెస్ కు సంబంధించి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోబో వెయిట్రెస్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం.. 

యూఎస్ లోని జపనీస్ రెస్టారెంట్ లో కస్టమర్లకు చక్కగా సేవలందిస్తోంది రోబె వెయిట్రెస్. అంటారియోలోని ప్రజలను జపనీస్ వంటకాలను అందించే అసహి అనే రెస్టారెంట్ లో కూర్చున్న కస్టమర్లకు ఆర్డర్ ను ఫుడ్ టేబుల్ వద్దకు నడిచి వస్తున్న హైపర్ రియలిస్టిక్ రోడోను మనం ఈ వైరల్ వీడియోల చూడొచ్చు. అయితే అక్కడ కస్టమర్లు ఇది సాధారణమే అనుకున్నప్పటికీ  సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయిన తర్వాత మనిషికు బదులుగా రోబోట్ వెయిట్రెస్ ను చూడటానికి నెటిజన్లు చాలా ఉత్సాహంగా వీడియోను చూశారు. 

జపనీస్ వంటకాలతో కస్టమర్లకు ఫుడ్ ప్లేట్ ను మోసుకెళ్తున్న రోబోట్ వెయిట్రెస్ .. చక్కగా మనిషిలా డ్రెస్సింగ్ చేసుకొని వాస్తవికంగా కనిపించింది.. ఆమె మనిషి కాదని కస్టమర్లు గుర్తించినంతగా.. రోబోటిక్ స్టైల్ లో నడుస్తు్న్నపుడు చేతిలో ఆహార పదార్థాలు పడిపోకుండా జాగ్రత్తగా పట్టుకుంది.

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.. షేర్ చేసిన కొన్ని గంటల్లో లక్షకు పైగా వీక్షణల మనసును దోచుకుంది. చాలా మంది నెటిజన్లు నమ్మలేకపోతున్నామని రాశారు. ఇది నిజంగా మనిషి అని కొట్టి పారేసిన నెటిజన్లు ఉన్నారు. అంతలా ఉంది మరీ రోబోట్ వెయిట్రెస్ పర్ఫార్మెన్స్..