Cricket World Cup 2023: ఇదీ కసి అంటే : పనికి రాడని సౌతాఫ్రికా వదిలేసింది.. నెదర్లాండ్స్ లో చేరి సఫారీలను ఓడించాడు

Cricket World Cup 2023: ఇదీ కసి అంటే : పనికి రాడని సౌతాఫ్రికా వదిలేసింది.. నెదర్లాండ్స్ లో చేరి సఫారీలను ఓడించాడు

టాలెంట్ ఒక్క రోజులో.. ఒక్క గంటలో నిరూపించుకునేది కాదు.. ఒక్కోసారి అదృష్టం కూడా ఉండాలి.. అదృష్టం ఉన్నోడికి టాలెంట్ లేకపోతే కొన్ని రోజులు బతుకు.. అదే టాలెంట్ ఉన్నోడికి అదృష్టం కలిసి రాకపోయినా.. నిలబడతాడు.. నిరూపించుకుంటాడు.. ఇలాంటి టాలెంటెడ్ స్టోరీ.. ఇప్పుడు ప్రపంచ క్రికెట్ మ్యాచుల్లో జరిగింది. సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్.. ఉత్కంఠ రేపగా.. సౌతాఫ్రికాను జట్టును ఓడించింది కూడా ఓ సౌతాఫ్రికా క్రికెటర్ కావటం ఇప్పుడు అందర్ని ఆసక్తి రేపిస్తుంది. ఈ ఎక్స్ క్లూజివ్ స్టోరీ ఏంటో చూద్దాం...

వాండెర్ మెర్వ్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. దానికి కారణం దక్షిణాఫ్రికా అతన్ని పట్టించుకోకపోవడమే. జోహెన్నెస్ బర్గ్ లో పుట్టిన ఈ 39 ఏళ్ళ స్పిన్ బౌలర్ ఒకప్పుడు సఫారీల జట్టులో స్థానం సంపాదించాడు. 2009, 10 మధ్య కాలంలో 13 టీ 20 లు, 13వన్డేలు ఆడాడు. అయితే ఆ తర్వాత ఫామ్ లేదని జట్టులో నుంచి ఉద్వాసన పలికారు. ఆ తర్వాత నెదర్లాండ్స్ జాతీయ జట్టులో చేరి సత్తా చూపిస్తున్నాడు. ఈ క్రమంలో నిన్న దక్షిణాఫ్రికాపై జరిగిన మ్యాచులో నెదర్లాండ్స్ కి చారిత్రాత్మక విజయాన్ని అందించాడు.

మొదటి బ్యాటింగ్ లో 19 బంతుల్లోనే 29 పరుగులు చేసి కెప్టెన్ ఎడ్వార్డ్స్ కి మంచి సహకారం అందించాడు. ఆ తర్వాత  బౌలింగ్ లో మరింతలా రెచ్చిపోయిన వాండెర్ కీలకమైన బావుమా, వాండెర్ డస్సెన్ వికెట్లు తీసుకొని సఫారీల జట్టుని కోలుకొని దెబ్బ తీసాడు. వాండెర్ మెర్వ్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో నెదర్లాండ్స్ 38 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. 

ఈ మ్యాచులో మొదట  బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 43 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. కెప్టెన్ ఎడ్వార్డ్స్ 68 బంతుల్లో 78 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ కి తోడు వాండెర్ మెర్వ్ (29) ఆర్యన్ దత్ (23) రాణించారు. ఇక లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ బౌలర్లు కట్టు దిట్టంగా బౌలింగ్ చేయడంతో సౌత్ ఆఫ్రికా 207 పరుగులకు ఆలౌటైంది. మిల్లర్ 43 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CricTracker (@crictracker)