అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎస్పీ

అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎస్పీ

పాల్వంచ, వెలుగు : మండలంలోని నాగారం రేపల్లె వాడలో స్థానిక యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో పాల్వంచ డీఎస్పీ సతీశ్​కుమార్, సీఐ కే.సతీశ్, నిర్వాహకులు గంగపురి శ్రీను, రాయల భాస్కర్, తోకల లింగయ్య, గంగపురి చంటి, దుర్గ, సిద్దెల గణేశ్, సుధీర్, ప్రసాద్, దుర్గాప్రసాద్, ప్రేమ్ కుమార్, శ్రీకాంత్, కల్యాణ్ , సీతారాములు, దుర్గారావు, సృజన్, వీరబాబు, ఏసుబాబు, రాములు, ధర్మసోత్ ఉపేందర్, రంజిత్, పవన్, వినయ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.