అడిలైడ్: ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేసే బాధ్యత బుమ్రా ఒక్కడిపైనే ఉండదని, మిగతా బౌలర్లు కూడా ఆ బాధ్యత తీసుకోవాలని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. అతని వర్క్‌లోడ్‌ను మిగిలిన బౌలర్లు కూడా పంచుకోవాలని సూచించాడు. ‘మేం ఒక్క బౌలర్‌తో ఆడటం లేదు. మిగతా బౌలర్లు కూడా బాధ్యత తీసుకోవాలి.
సిరాజ్, హర్షిత్, నితీశ్, ఆకాశ్ దీప్, ప్రసిధ్ కృష్ణ ఎవరైనా సరే టీమ్‌కు కోసం తమ కర్తవ్యాన్ని నెరవేర్చాలి’ అని హిట్‌మ్యాన్ స్పష్టమైన మెసేజ్ ఇచ్చాడు. రెండో టెస్టులో బ్యాటింగ్ వైఫల్యంతోనే ఓడిపోయామని రోహిత్ చెప్పాడు. పింక్ బాల్‌తో ఎక్కువ ఆడిన అనుభవం లేకపోయినా.. తమ ఓటమికి దాన్ని సాకుగా చూపడం లేదని స్పష్టం చేశాడు. మూడో టెస్టులో బలంగా పుంజుకునే ప్రయత్నం చేస్తామన్నాడు.