కెప్టెన్ గా టీ20ల్లో రోహిత్ నయా రికార్డ్

 టీ20ల్లో వరుస విజయాలతో టీమిండియా దూసుకుపోతుంది. వరుసగా 11 మ్యాచ్ లు గెలిచి సత్తా చాటుతోంది. నిన్న శ్రీలంకతో జరిగిన సెకండ్ టీ20లో విజయంతో కెప్టెన్ గా రోహిత్ శర్మ కొత్త రికార్డ్ సృష్టించాడు. స్వదేశంలో అత్యధిక టీ20 లు గెలిచిన కెప్టెన్ గా రికార్డ్ సృష్టించాడు. మొత్తం భారత్ లో 17 టీ20లకు కెప్టెన్ గా  16 మ్యాచ్ లు గెలిచాడు. రోహిత్ తర్వాత  చెరో 15 విజయాలతో ఇంగ్లాండ్ ఇయాన్ మోర్గాన్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్  ఉన్నారు. మొత్తంగా 25 టీ20 మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించిన రోహిత్ 23 విజయాలు అందించాడు. ఇప్పటికే శ్రీలంక, న్యూజిలాండ్ లపై టీ20 సిరీస్ లను వైట్ వాష్ చేశాడు. ఇవాళ జరగనున్న మూడో టీ20 కూడా గెలిస్తే వరుసగా మూడు సిరీస్ లు వైట్ వాష్ చేసిన కెప్టెన్ గా కూడా రోహిత్ రికార్డ్ సృష్టిస్తాడు.

మరిన్ని వార్తల కోసం

పక్క దేశాలకు నడిచి పోతున్రు

మెడికల్​ ఫీల్డ్​లోకి ప్రైవేట్ ​సంస్థలు రావాలే