దొంగలు బాబోయ్ దొంగలు: ప్రాక్టీస్ టైంలో రోహిత్ ఐఫోన్ మాయం

దొంగలు బాబోయ్ దొంగలు: ప్రాక్టీస్ టైంలో రోహిత్ ఐఫోన్ మాయం

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ  ఐఫోన్ ఎవరో దొంగిలించారనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. సహజంగా తన వస్తువులను మర్చిపోయే అలవాటు ఉన్న రోహిత్.. తన ఫోన్ ఎక్కడైన పెట్టి మర్చిపోయి ఉంటాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు రోహిత్ మాత్రం తన ఫోన్ పోయిందని స్థానిక అధికారులతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగి ఫోన్‌ను వెతికిపెట్టే పనిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

అసలేం ఏం జరిగిందంటే..?

భారత్-ఆస్ట్రేలియా మధ్య రాజ్ కోట్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో రోహిత్ 57 బంతుల్లోనే 81 పరుగులు చేసి అభిమానులని ఖుషీ చేసినా రోహిత్ మాత్రం సంతోషంగా లేడు. ఈ మ్యాచుకు ముందు రోహిత్ తన ఐఫోన్ పోగొట్టుకున్నాడట. ప్రాక్టీస్ చేసిన తర్వాత తన ఫోన్ చూసుకుంటే కనపడలేదు. అక్కడ అంత వెతికినా తన ఫోన్ మాత్రం దొరకలేదు. అయితే ఆ ఫోన్‌ను ఎవ‌రో దొంగిలించి ఉంటార‌ని అధికారులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. 

ALSO READ  : ODI World Cup 2023: నా వ్యూహం అదే.. కోహ్లీని ఔట్ చేయడానికి 5 బంతులు చాలు: నెదర్లాండ్స్ బౌలర్

కాగా.. ఇటీవల ఆసియా క‌ప్‌ టైటిల్ గెలిచిన తర్వాత రోహిత్ కొలంబో నుంచి ముంబైకి బయలుదేరుతుండగా.. తన పాస్‌పోర్టును హోటల్‌ రూమ్‌లో మర్చిపోయాడు. ఈ  విషయాన్ని ఎయిర్ పోర్ట్ వెళ్లిన తర్వాత గుర్తించిన రోహిత్ అక్కడ ఉన్న సిబ్బందితో తన పాస్ పోర్ట్ ని తెప్పించుకున్నాడు. ప్రస్తుతం రోహిత్ గౌహతిలో ఉన్నాడు. వరల్డ్ కప్ లో భాగంగా రేపు ఇంగ్లాండ్ తో వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉంది.