టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ ఫిట్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ క్రికెటర్లలో బెస్ట్ ఫిట్ నెస్ విరాట్ కే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. 35 ఏళ్ళ వయసులోనూ కుర్రాళ్లని మించిపోతున్నాడు. కెరీర్ మొత్తం మీద గాయంతో కోహ్లీ మ్యాచ్ లు ఆడని సందర్భాలు వేళ్ళ మీద లెక్కపెట్టుకోవచ్చు.
ఆటకు దూరంగా ఉన్నా..ప్రతి రోజు కోహ్లీ ఫిట్ నెస్ పై ప్రత్యేక దృష్టి పెడతాడు. డైట్ విషయంలో సైతం ఈ పరుగుల వీరుడు కఠినంగా ఉంటాడు. తాజాగా ఇంగ్లాండ్ తో తొలి రెండు టెస్టులకు దూరమైనా కోహ్లీ ఫిట్ నెస్ పై కసరత్తులు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోహ్లీ ఫిట్ నెస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టు నేపథ్యంలో వెటరన్ ఆటగాడు దినేశ్ కార్తీక్‌తో రోహిత్ మాట్లాడుతూ.. ఫిట్‌నెస్ సమస్యలతో కోహ్లి ఎప్పుడూ జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)కి వెళ్లలేదని.. ఎంత సాధించినా పరుగుల ఆకలితో తపిస్తూ ఉంటాడని అన్నాడు. ఆట పట్ల కోహ్లీ అంకిత భావం చూసి యువ క్రికెటర్లు నేర్చుకోవాలని రోహిత్ అన్నారు. ఇప్పటివరకు ఎంత సాధించినా ఇంకా అసంతృప్తిగానే ఉన్నాడు. అతని దాహం తీరనిది. దేశం తరపున ఆడటాన్ని కోహ్లీ గర్వంగా భావిస్తాడు. అని కోహ్లీని హిట్ మ్యాన్ పొగడ్తల వర్షం కురిపించాడు.
ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి రెండు టెస్టులకు కోహ్లీ దూరంగా ఉంటున్నాడు. వ్యక్తిగత కారణాల వలన కోహ్లీ తప్పుకున్నాడు. మూడో టిస్యూ సమయానికి అందుబాటులో వస్తాడని భారత జట్టు యాజమాన్యం స్పష్టం చేసింది. కోహ్లీ లేకపోవడంతో భారత్ నిన్న ముగిసిన తొలి టెస్టులో ఓడిపోయిన సంగతి తెలిసిందే. కోహ్లీ స్థానంలో రజత్ పటిదార్ ను ఎంపిక చేశారు. ఇదిలా ఉండగా స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ ఇప్పటివరకు కేవలం రెండు టెస్టులు, రెండు టీ20 లు మాత్రమే ఆడాడు.
Rohit Sharma acknowledges Virat Kohli's unwavering passion and commitment to the game. pic.twitter.com/U1jnyBeJn4
— CricTracker (@Cricketracker) January 29, 2024