గుడ్ న్యూస్ : టెన్త్ పాసైతే చాలు.. రైల్వేలో ఉద్యోగం..

గుడ్ న్యూస్ : టెన్త్  పాసైతే చాలు.. రైల్వేలో ఉద్యోగం..

దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో 32,438 గ్రూప్–డి లెవల్​–1 పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్​మెంట్​ బోర్డు(ఆర్ఆర్ బీ) నోటిఫికేషన్​ జారీ చేసింది. పదో తరగతి, ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్లకు ఈ నెల 23వ తేదీ ఆఖరు. 

పోస్టులు (32,438): ట్రాక్​ మెయింటెయినర్​గ్రూప్–4 – 13,187, పాయింట్స్ మెన్ – 5,058, అసిస్టెంట్(వర్క్ షాప్) – 3077, సిస్టెంట్​(సి అండ్​డబ్ల్యూ)–2587, అసిస్టెంట్​ టీఎల్​అండ్​ ఏసీ–1041, అసిస్టెంట్​ లోక్​షెడ్​–950, అసిస్టెంట్​ ఆపరేషన్స్(ఎలక్ట్రికల్)–744, అసిస్టెంట్​టీఎల్​అండ్​ఏసీ(వర్క్ షాప్)–625, అసిస్టెంట్​(ట్రాక్​ మెషిన్)–799, అసిస్టెంట్​పీ–వే–247, అసిస్టెంట్​ లోకోషెడ్​(డీజిల్)–420, అసిస్టెంట్​(ఎల్​అండ్​సీ)–2012,  అసిస్టెంట్​ టీఆర్‌‌ డీ–1381.ఆర్ఆర్​బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్​పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్​పూర్, కోల్​కతా, మాల్దా, ముంబయి, పట్నా, ప్రయాగ్​రాజ, రాంచీ, సికింద్రాబాద్. 

ఎలిజిబిలిటీ: పదో తరగతి లేదా ఐటీ డిప్లొమా, నేషనల్​ కౌన్సిల్​ ఫర్ వొకేషనల్​ ట్రైనింగ్ జారీ చేసిన నేషనల్​ అప్రెంటీస్​సర్టిఫికెట్(ఎన్ఏసీ), సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత. 2025, జులై 1 నాటికి 18 నుంచి 36 ఏండ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీహెచ్ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్​ ఎఫిషియెన్సీ టెస్ట్, మెడికల్​ ఎగ్జామినేషన్​ ఆధారంగా ఎంపిక చేస్తారు.