
వనపర్తి, వెలుగుః వనపర్తి నియోజకవర్గంలోని గ్రామీణ రహదారుల కోసం ప్రభుత్వం నిధులు రూ.11.44 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఖిల్లా గణపురం నుంచి మహ్మదుస్సేన్ పల్లి గ్రామం వరకు రోడ్డు నిర్మాణానికి రూ. కోటి మంజూరయ్యాయని పేర్కొన్నారు.
పెద్దమందడి మండలం వెల్టూర్ నేషనల్ హైవే నుంచి గట్లఖానాపురం, సోళీపురం వరకు రూ. 2.51 కోట్లు మంజూరయ్యాయన్నారు. వీటితో పాటు వివిధ గ్రామాలకు కూడా రోడ్ల నిర్మాణానికి మొత్తం రూ. 11.44 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే ప్రకటనలో పేర్కొన్నారు.