శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులు. 21 కోట్ల 90లక్షల విలువు చేసే 3.129 కేజీల హెరాయిన్ డ్రగ్స్ సీజ్ చేశారు. కెన్యా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తరలిస్తున్నారన్న పక్కా సమాచారంలో దాడులుచేశామన్నారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులు. బిజినెస్ వీసాపై హైదరాబాద్ కు వచ్చిన మలావి దేశానికి చెందిన మహిళ నుంచి డ్రగ్స్ సీజ్ చేశారు. రెండు పాలిథిన్ కవర్లలో ప్యాక్ చేసి ట్రావెలింగ్ బ్యాగ్ లో డ్రగ్స్ తరలిస్తుండగా పట్టుకున్నారు DRI అధికారులు.
అసలే 8 మ్యాచ్ లు ఓడిపోయామన్న బాధతో ఉంటే.. కృనాల్ ఓవరాక్షన్..!