న్యూ ఇయర్ వేడుకల సమీపిస్తున్న కొద్దీ డ్రగ్స్, గంజాయివంటి నిషేధిత మత్తు పదార్థాలు తెలంగాణ వ్యాప్తంగా భారీగా పట్టుబడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత డ్రగ్స్, గంజాయి వంటినిషేధిత మత్తు పదార్థాలను విక్రయించేవారిపై, తీసుకుంటున్న వారిపై కఠిన చర్యతీసుకోవాలని పోలీసులను అదేశించిన క్రమంలో.. రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున డ్రగ్స్, గంజాయి పట్టుబడుతోంది.
నిజామాబాద్ జిల్లాలో జోరుగా డ్రగ్స్ దందా సాగుతోంది. నిజామాబాద్ పట్టణంలోని వినాయక్ నగర్ లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. ఓ బయోమెడదిక్ ఫార్మాస్యూటికల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీసులో ఈ డ్రగ్స్ నిలువ ఉంచారని పక్కా సమాచారంతో డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేసి రూ. 6 లక్షల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ ను క్యాప్సూల్స్ రూపంలో సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఫార్మా కంపెనీపై కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.