రూ. 98 లక్షలు పట్టుకున్న సైబరాబాద్ SOT పోలీసులు

రూ. 98 లక్షలు పట్టుకున్న సైబరాబాద్ SOT పోలీసులు

హైదరాబాద్: బ్యాంకులకు నగదు తీసుకువెళ్లే రెండు వాహనాలలో ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదు సీజ్ చేశారు సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు. సైబరాబాద్ ఎస్వోటీ మేడ్చల్ టీం, శామీర్ పేట్ , దుండిగల్ పోలీస్ స్టేషన్ల సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించగా..క్యూఆర్ కోడ్లు, ఎన్నికల సంఘం నిబంధనలు పాటించకుండా రెండు వాహనాల్లో అక్రమ రవాణా చేస్తున్న రూ. 98లక్షల 32వేల 200 లు నగదు  బయటపడింది. 

CMS క్యాష్ లాజిస్టిక్స్ వాహనం నం. TS 09 UE 0549లో తరలిస్తున్న రూ. 20లక్షల నగదును పట్టుకున్నారు. మరో క్యాష్ లాజిస్టిక్స్ వాహనం TS 09 UD 6991లో రూ. 48 లక్షల 32 వేల 200 లను స్వాధీనం చేసుకున్నారు.