ఎస్సీల మీద ప్రధానికి ప్రేమ ఉంటే..వర్గీకరణకు ఆర్డినెన్స్ తేవాలె: ఆర్ ఎస్ ప్రవీణ్

మందకృష్ణను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలి:ఆర్ఎస్ ప్రవీణ్

కాగజ్​నగర్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీకి ఎస్సీల మీద నిజంగా ప్రేమ ఉంటే.. పూర్తి మెజారిటీ ఉన్న కేంద్రం వెంటనే ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్సు తీసుకురావాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు, సిర్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్​ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను నియమించాలన్నారు.

మోదీ.. మాదిగల మీద ప్రేమ చూపిస్తున్నది ఓట్లు పొందేందుకే అని విమర్శించా రు. సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని బీఎస్పీ ఆఫీస్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. యూపీలో దళితులు, గిరిజనుల మీద దాడులు చేసిన బీజేపీ.. మాదిగల మీద ప్రేమ చూపిస్తోందని ఎద్దేవా చేశారు. అధికార పార్టీ లీడర్ల బాధితులు ఎవరైనా ఉంటే.. వారి సమస్యలు చెప్పుకొనేందుకు ప్రత్యేకంగా ర్యాపిడ్​ సిర్పూర్ ప్రొటెక్షన్ పేరిట ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని, బాధితులు 9888677776 కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

 ALSO READ : బీసీ డిక్లరేషన్ కలిసొచ్చేనా?

డిసెంబర్ 5 తర్వాత స్పెషల్ ఇన్వెస్టిగేషన్  టీం ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో అధికార దుర్వినియోగంపై రాష్ట్ర ఎన్నికల అధికారికి, డీజీపీకి ఫోన్ చేసి కంప్లయింట్​చేస్తే.. చేస్తాం, చూస్తాం అంటున్నారని పేర్కొన్నారు.