వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా శుక్రవారం(నవంబర్ 10) ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆఫ్ఘన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ జట్టు 400 పైచిలుకు పరుగుల తేడాతో విజయం సాధిస్తే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోవచ్చు. పటిష్ట సౌతాఫ్రికాపై అది సాధ్యమయ్యే పని కాదు కనుక విజయంతో టోర్నీని ముగించాలని ఆఫ్ఘన్ జట్టు భావిస్తోంది.
ALSO READ: సెమీస్‌కు న్యూజిలాండ్!.. 5 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలుపు
దక్షిణాఫ్రికా: తెంబ బవుమా(కెప్టెన్), క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), రసీ వాండర్ డస్సెన్, ఎడెన్ మరక్రం, క్లాసెన్, డేవిడ్ మిల్లర్, పెహ్లుక్వాయో, కేశవ్ మహారాజ్, రబాడ, గెరాల్డ్ కోయెట్జ్, ఎంగిడి.
అఫ్గానిస్థాన్: రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జర్దాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్‌జాయ్, నబీ, రషీద్ ఖాన్, ఇక్రం అలీఖిల్, ముజీబ్, నూర్ అహ్మద్, నవీన్ ఉల్ హక్.
? NEWS FROM AHMEDABAD ?
— Afghanistan Cricket Board (@ACBofficials) November 10, 2023
Afghanistan skipper @Hashmat_50 has won the toss and decided that AfghanAtalan will bat first against South Africa. ?#AfghanAtalan | #CWC23 | #AFGvSA | #WarzaMaidanGata pic.twitter.com/Oo8vuEmLK9