- పండగపూట తనిఖీలు ముమ్మురం
- ఆదివారం నాటికి 360 బస్సులపై కేసులు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: సంక్రాంతి పండగపూట కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండడంతో ఆర్టీఏ విజిలెన్స్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. విజయవాడ హైవేలో మూడురోజులుగా తనిఖీలు చేపట్టి నిబంధనలను పాటించని వాహనాలకు చలానాలు విధించడంతో కేసులు నమోదు చేస్తున్నారు. శనివారం నాటికి 250 కేసులు నమోదు కాగా, ఆదివారం మరో 110 కేసులు నమోదు చేసినట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు. పెద్ద అంబర్ పేట్ ఔటర్ వద్ద, దిల్సుఖ్నగర్, ఎల్బీ నగర్, హయత్‌నగర్, సికింద్రాబాద్, కేపీహెచ్‌బీ, మియాపూర్, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేస్తున్నారు.
అధిక రేట్ల గురించి ప్యాసింజర్లను అడిగి తెలుసుకుంటున్నారు. ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదు అందితే సదరు ట్రావెల్స్యజమానులపై కేసులు నమోదు చేస్తున్నారు. తప్పనిసరిగా ఆర్టీఏ నుంచి పర్మిట్, ప్రావీణ్యం కలిగిన డ్రైవర్లు, ప్రయాణికులకు అందుబాటులో ఫస్ట్ఎయిడ్బాక్సులు, ఫైర్‌సేఫ్టీ వంటివి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండలోని వివిధ ప్రాంతాల్లో బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నట్లు ఆర్టీఏ విజిలెన్స్అండ్ఎన్ఫోర్స్మెంట్జేటీసీ చంద్రశేఖర్‌గౌడ్ తెలిపారు.