ముంబై: రూపాయి పతనం ఆగడం లేదు. డాలర్‌తో దీని మారకం విలువ గురువారం 21 పైసలు తగ్గి 86.61కు పడిపోయింది. డాలర్ మరింత బలపడటం, క్రూడాయిల్‌ధరలు, ఫారిన్ ఫండ్ ఔట్‌ఫ్లోలు పెరగడంతో బలహీనపడింది. అయితే డొమెస్టిక్ మార్కెట్లు లాభపడటంతో రూపాయికి కొద్దిగా మేలు జరిగిందని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. ఇంటర్బ్యాంక్ఎక్స్చేంజ్లో రూపాయి 86.56 వద్ద ఓపెనై, ఇంట్రాడే హై 86.37కు చేరుకుంది. చివరికి 86.61 వద్ద ముగిసింది. బుధవారం మాత్రం 13 పైసలు లాభపడి 86.40కి చేరింది.
దిగుమతిదారుల నుంచి విపరీతమైన డిమాండ్ వల్ల కూడా డాలర్ బలపడిందని మిరాయి అసెట్ షేర్‌ఖాన్‌లో రీసెర్చ్ఎనలిస్ట్ అనుజ్ చౌదరి చెప్పారు. ఇక నుంచి కూడా వీళ్లు మరిన్ని డాలర్లను కొనే అవకాశం ఉందని, దీనివల్ల రూపాయిపై ఒత్తిడి పెరుగుతుందని చెప్పారు. డొమెస్టిక్ఈక్విటీ మార్కెట్లో గురువారం సెన్సెక్స్318.74 పాయింట్లు, నిఫ్టీ 98.60 పాయింట్లు లాభపడ్డాయి. ఎఫ్ఐఐలు బుధవారం రూ.4,533.49 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు.