
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్‌లో 21 నుంచి 23 వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న రైతు మహోత్సవానికి గిరిరాజ్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్ సిద్ధమైంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకను ఏర్పాటు చేసింది. ఉదయం 11 గంటలకు ప్రారంభ కార్యక్రమానికి మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావు హాజరుకానున్నారు. వ్యవసాయ, అనుబంధ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్ డిపార్ట్మెంట్లు కూడా ఇందులో భాగం పంచుకుంటున్నాయి.
నేటి ప్రజావాణి రద్దు
రైతు మహోత్సవం, ముగ్గురు మంత్రుల రాక నేపథ్యంలో సోమవారం ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రాజీవ్‌గాంధీ తెలిపారు. ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.