
- పోస్టర్ను విడుదల చేసిన అగ్రికల్చర్ డైరెక్టర్ బి.గోపి
హైదరాబాద్, వెలుగు: వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతు మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అందులో భాగంగా ఈ నెల 21 నుంచి23 వరకు నిజామాబాద్ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. శనివారం బషీర్బాగ్ కమిషనరేట్ లో అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి రైతుమహోత్సవానికి సంబంధించిన పోస్టర్, కరపత్రాన్ని ఆవిష్కరించారు. మూడ్రోజులపాటు జరిగే ఈ రైతు మహోత్సవానికి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన రైతులు వేలాదిగా తరలి వస్తారని డైరెక్టర్ గోపి తెలిపారు.
వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించి 150 వరకు స్టాల్స్ రైతు మహోత్సవంలో ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. రైతు మహోత్సవ వేడుకను విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్శాఖ అడిషనల్ డైరెక్టర్ కె. విజయ్ కుమార్, జాయింట్ డైరెక్టర్లు బాలు, వై. సుచరిత, అసిస్టెంట్ డైరెక్టర్లు మేరీ రేఖ, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.