అవేమన్నా స్పెషలా : హైదరాబాద్ సిటీలో టాప్ రెస్టారెంట్ బిర్యానీలో ఐరన్ పిన్స్

తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టినా రెస్టారెంట్ల తీరు మాత్రం మారడం లేదు.. ఒకడు కల్తీ ఫుడ్ అమ్మితే.. ఇంకోడు పాచి పోయిన ఆహారం వడ్డిస్తున్నాడు.. ఇదిలా ఉంటే.. పెద్ద పెద్ద హోటల్స్ పెద్ద పెద్దగా ఆలోచించి పరమ చెత్త పనిని చాలా గొప్పగా చేస్తామని అంటున్నారు. ఫుడ్ సేఫ్టీ అయితే మాకేంటి మాకేంద భయం అన్నట్టు వారి తీరు తయారైంది. ఇంతకు ఏమైందనుకుంటున్నారా.. అయితే పూర్తిగా చదవండి..

హైదరాబాద్ మణికొండలోని మెహ్‌ఫిల్ రెస్టారెంట్‌లో ఒక కస్టమర్ తాను ఆర్డర్ చేసిన బిర్యానీలో సేఫ్టీ పిన్‌ను(కాంట) కనుగొన్నాడు. కస్టమర్ జూన్ 29,2024, శనివారం నాడు సేఫ్టీ పిన్‌తో బిర్యానీ ఫోటోను పోస్ట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రతిస్పందన కోరుతూ అధికారులకు ట్యాగ్ చేశాడు. దీనిపై స్పందించిన హైదరాబాద్ పోలీసులు తన వాట్సాప్‌లో జీహెచ్‌ఎంసీని ట్యాగ్ చేస్తూ సైబరాబాద్ పోలీసులకు వివరాలు పంపాలని కోరారు. 

కస్టమర్ దీనిపై స్పందిస్తూ ఇంత తొందరగా స్పందించినందుకు ధన్యవాదాలు ఇప్పుటి నుంచి ఇతర కస్టమర్‌లకు ఈ విషయం జరగదని మేము ఆశిస్తున్నాము. దయచేసి రెస్టారెంట్‌పై అవసరమైన చర్య తీసుకోండని కోరాడు.  కాగా, కొన్ని రోజుల క్రితమే మెహ్‌ఫిల్ కూకట్‌పల్లి ఏరియా బ్రాంచ్ నుండి ఆర్డర్ చేసిన బిర్యానీలో కూడా మరేదో వచ్చిందని మరో కస్టమర్ వాపోయాడు. 

ఇదంతా ఇలా ఉంటే.. నెటిజన్స్ మాత్రం దీనిపై సీరియస్ గా కామెంట్ చేస్తున్నారు. అధికాలు రెస్టారెంట్స్ పై నిఘా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు.