ఓటర్ నమోదుపై కలెక్టర్ సీరియస్.. సీనియర్ అసిస్టెంట్ కు షోకాజ్ నోటీసులు

కాగజ్ నగర్, వెలుగు : ప్రత్యేక  ఓటరు నమోదు కార్యక్రమం పట్ల  నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కలెక్టర్ హేమంత్ సహదేవ్ రావ్ బోర్కడే సీరియస్ అయ్యారు. ఆదివారం కౌటల, చింతల మానేపల్లి, సిర్పూర్ టీ మండలాల్లో  ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను  తనిఖీ చేశారు. కౌటాల జీపీకి కలెక్టర్ వచ్చిన సమయంలో తహశీల్దార్ అందుబాటులో లేకపోవడంతో అక్కడే ఉన్న బీఎల్వోలు,  సీనియర్ అసిస్టెంట్ దౌలత్ రావును వివరాలు అడిగారు.

 కొత్త దరఖాస్తుల వివరాలు, తదితర అంశాలపై స్పష్టంగా చెప్పకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. సరైన సమాధానం చెప్పలేక పోవడంతో అడిగింది అర్థం అవుతోందా అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  బాధ్యత లేకుండా వ్యవహరించిన తహసీల్దార్ కిరణ్,  సీనియర్ అసిస్టెంట్ దౌలత్ కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత ఆఫీసర్లను కలెక్టర్ ఆదేశించారు.  ఆయన ఎంట ఎస్ఐ మధూకర్

 ఉన్నారు.