బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఈ నెల 16న తన నివాసంలో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఐతే ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రతీది క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అయితే ఇటీవలే ఈ కేసు విచారణలో భాగంగా సైఫ్ అలీ ఖాన్ బ్లడ్ శాంపిల్స్, దాడి సమయంలో ధరించిన దుస్తులు వంటివి పోలీసులు తీసుకున్నారు. అయితే ఈ కేసులో అరెస్టయిన షరీఫుల్ ఇస్లాం షెహజాద్ ఫింగర్ ప్రింట్స్ సైఫ్ అలీఖాన్ ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ కావడంలేదని పోలీసులు కనుగొన్నారు. అలాగే ఈ కేసుతో సీఐడీకి ఎలాంటి పాత్ర లేదని రాష్ట్ర సీఐడీకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ధృవీకరించారు.
ప్రాథమిక నివేదికలో షరీఫుల్‌తో మ్యాచ్ ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు. దీంతో జనవరి 24న బాంద్రా కోర్టులో అతనిని కోర్టు హాజరుపరిచిన తర్వాత షరీఫుల్ కస్టడీని జనవరి 29 వరకు పొడిగించారు. అలాగే ఫేస్ రికగ్నైజేషన్ టెస్టుల కోసం సమయం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ALSO READ | ఇంట్రెస్టింగ్ గా విజయ్ 69 మూవీ టైటిల్.. సినిమా బ్యాక్ డ్రాప్ అదేనా..?
సిసిటివి ఫుటేజీలో చూసిన వ్యక్తిని పోలిన సౌత్ ముంబైకి చెందిన డ్రగ్-అడిక్ట్ అయిన మరొక వ్యక్తికి కూడా ఈ ఫింగర్ ప్రింట్స్ టెస్ట్ నెగిటివ్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారి స్పష్టం చేశారు. ఇక పోలీసుల విచారణలో షరీఫుల్ నకిలీ భారతీయ డాక్యుమెంట్స్ సరఫరా చేసి కోల్‌కతా నుండి ముంబైకి తన ప్రయాణాన్ని సులభతరం చేసినట్లు తెలిపాడు. దీంతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అక్రమాలకి పాల్పడుతున్న ఏజెంట్‌లని పట్టుకునేందుకు బాంద్రా నుండి పోలీసు బృందం కోల్‌కతాకు వెళ్లినట్లు సమాచారం.