![అశ్విన్ సినిమాలో సల్మాన్ బ్రదర్.. ఏడేళ్ల తర్వాత టాలీవుడ్ కు రీ ఎంట్రీ](https://static.v6velugu.com/uploads/2024/01/salman-khan-brother-arbaaz-khan-is-acting-in-tollywood-hero-ashwin-babu-film_r6OEdp9aRY.jpg)
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ సోదరుడు అర్పాజ్ ఖాన్ ఏడేళ్ల తర్వాత టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి జై చిరంజీవ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు అర్పాజ్ ఖాన్ .ఆ తర్వాత 2017లో రాజ్ తరుణ్ నటించిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాలో విలన్ గా నటించాడు. ఇటీవల మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ బిగ్ బ్రదర్ చిత్రంలో కూడా నటించారు. తర్వాత మళ్లీ ఇపుడు టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్నాడు.
యువ నటుడు అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రీకరణ జరుగుతున్న విషయం తెలిసిందే. అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోకి అర్బాజ్ ఖాన్ నటిస్తున్నాడు. చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాలో నటిస్తుండటం తనకు సంతోషంగా ఉంది. అది గంగా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ 1 లో తెరకెక్కుతున్న ఒక డిఫరెంట్ కథలోని ముఖ్య పాత్రతో జరగడం ఇంకా ఆనందంగా ఉందన్నారు అర్పాజ్ ఖాన్.
ఈ సందర్భంగా మాట్లాడిన చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి 'అశ్విన్ బాబు హీరోగా ఒక వైవిధ్యమైన కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. మా సంస్థ గంగా ఎంటర్టైన్మంట్స్ మొదటి నిర్మాణంలోనే అర్బాజ్ ఖాన్ గారితో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. కొత్త కథ, కథనాలతో రూపొందుతున్న న్యూ ఏజ్ సినిమా ఇది. అర్బాజ్ గారి పాత్ర అద్భుతంగా అంటుంది. ఈ రోజు నుంచి జరగనున్న కొత్త షెడ్యూల్ తో ఆయన సెట్స్ లోకి అడుగు పెడతారు. ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో సినిమా చేస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని అన్నారు.
అశ్విన్ బాబు సరసన దిగంగనా సూర్యవంశీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో 'హైపర్' ఆది, తమిళ నటుడు సాయి ధీన ప్రధాన పాత్రలో నటించనున్నారు.
ఎడిటర్ : ఛోటా కె ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్ : సాహి సురేష్ (కార్తికేయ 2 ఫేమ్)
మ్యూజిక్ డైరెక్టర్ : వికాస్ బడిస
డీవోపీ : దాశరథి శివేంద్ర (హనుమాన్, మంగళవారం ఫేమ్)
పి ఆర్ ఓ :నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా )
నిర్మాత : మహేశ్వర్ రెడ్డి మూలి
దర్శకత్వం : అప్సర్