
సంభాల్: ఈ నెల 14 శుక్రవారం రోజు హోలి పండుగ రావడం, రంజాన్ మాసం ప్రార్థనల నేపథ్యం లో ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకు న్నారు. ఆ రోజు మధ్యాహ్నం 2:30 గంటల దాకా హిందువులు హోలీ జరుపుకోవాలని, ఆ తర్వాత ముస్లింలు నమాజ్ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
మతపరం గా సున్నితమైన ప్రాంతం కావడంతో ఇరు వర్గాలతో సంభాల్ ఎస్పీ కృష్ణన్ కుమార్ శుక్రవారం మీటింగ్ నిర్వహించారు. ఆపై మీడియాతో మాట్లాడుతూ..‘‘హోలీ, రంజాన్ పండుగల సందర్భంగా సిటీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బలగాలను మోహరిస్తాం” అని చెప్పారు.