యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల జంటగా సాహిత్ మోత్ఖూరి దర్శకత్వంలో నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె నిర్మించిన చిత్రం ‘పొట్టేల్’. అక్టోబర్ 25న సినిమా రిలీజ్. శుక్రవారం (అక్టోబర్ 18న) ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన హీరోయిన్ సంయుక్త మీనన్ మాట్లాడుతూ ‘ట్రైలర్ చాలా బాగుంది. డైరెక్టర్ సాహిత్ మంచి కంటెంట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ట్రైలర్‌లో ఫస్ట్ షాట్ చూసినప్పుడు రియల్ పాన్ ఇండియన్ ఫిల్మ్ అనిపించింది. ఇంత మంచి ఎఫర్ట్‌తో సినిమాని తీసిన యూనిట్ అందరికీ అభినందనలు’ అని చెప్పింది.
ALSO READ | సందేశాత్మక కథతో డర్టీ లవ్ : కర్రి బాలాజీ
అనన్య నాగళ్ల మాట్లాడుతూ ‘ట్రైలర్‌లో చూసింది ఒక శాతం మాత్రమే, సినిమా చూసిన ఆడియెన్‌గా చెప్తున్నా. ఈ సినిమా ఆడియెన్స్‌తో వన్ వీక్ ట్రావెల్ చేస్తూనే ఉంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు గ్రేట్ స్టోరీ ఉంది’ అని అంది. ఒక జెన్యూన్ ఫిలింని ప్రేక్షకులు చూడబోతున్నారు అని యువ చంద్ర కృష్ణ చెప్పాడు.
ఆడియెన్స్ రియాక్షన్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా అన్నాడు డైరెక్టర్ సాహిత్. సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందని నిర్మాతలు అన్నారు. ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించామని నటులు అజయ్, నోయల్ చెప్పారు. టీమ్ అంతా పాల్గొన్నారు.