సత్తుపల్లి, వెలుగు: సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. బుధవారం హైదరాబాద్ లోని సెక్రటేరియట్ లో సీఎం కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసినట్లు చెప్పారు. పెనుబల్లి మండలంలో రూ.75లక్షలతో షాదీఖానా నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు.
పలుమార్లు సీఎం కేసీఆర్ ని కలిసి వినతి పత్రాలను అందజేయగా సీసీ రోడ్లు, ఇతరత్రా అభివృద్ధి పనులకు రూ.50 కోట్లు, స్టేట్ డెవలప్మెంట్ ఫండ్స్ నుంచి మరికొన్ని నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోలను విడుదల చేయడం సంతోషకరమన్నారు. ఇది ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం, అభివృద్ధిపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధిపై సీఎం రాజీ పడడంలేదన్నారు.