ఆర్మూర్/లింగంపేట, వెలుగు: సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించేందుకు గ్రామస్థాయిలో ఈఆర్ ఫౌండేషన్ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఆర్మూర్ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి వేముల దీప్తి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి సరళ రాణి అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈఆర్ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఈరవత్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఆర్మూర్మండలం ఇస్సాపల్లిలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన వేముల లత, షట్పల్లి పూజ శ్రీ, మేఘనకు నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
బహుమతిగా వెండి కడియాలు
లింగంపేట మండలంలో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు. మహిళలు ఉదయం నుంచి తమ వాకిళ్లను ముగ్గులతో అలంకరించారు. ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్యెల్యే మదన్మోహన్రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్‌మండల అధ్యక్షుడు నారాగౌడ్ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన మహిళలకు వెండి కడియాలను ఎస్సై సుధాకర్అందజేశారు. మార్కెట్‌కమిటీ వైస్ చైర్మన్ రాజు నాయకులు వంజరి ఎల్లమయ్య, భైరయ్య, రఫీక్, అశోక్, ప్రసాద్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.