దేశవ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దేవి నవరాత్రి ఉత్సవాల్లో మూలా నక్షత్రం రోజున ( అక్టోబర్9) చదువుల తల్లి.. త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మదేవుని భార్య సరస్వతి దేవిని పూజిస్తారు. పురాణాల ప్రకారం.. సరస్వతి దేవిని పూజిస్తే.. విద్యలో రాణించి.. చదువులోఉన్నత శిఖరాలకు చేరుకుంటారని పండితులు చెబుతున్నారు. అలాగే చదువులో వచ్చే ఆటంకాలు తొలగి.. ఆగిన పనులు నెరవేరుతాయి. నవరాత్రి ఉత్సవాల్లో కనకదుర్గాదేవి జన్మనక్షత్రం మూల నక్షత్రం రోజున సరస్వతి దేవిని ఎలా పూజించాలో తెలుసుకుందాం. .. .
హిందూమతంలో సరస్వతి దేవిని చదువుల తల్లిగా కొలుస్తారు. దేవీ భాగతవం ప్రకారం.. బ్రహ్మకు .. సరస్వతి దేవిని విష్ణువు ఇచ్చాడు. బుద్ది.. వివేకం.. వాక్ ..ఙ్ఞానం.. కళలు వంటి రంగాల్లో రాణించాలంటే విద్యను అభ్యసించాలి. విద్యలో పురోగతి సాధించాలంటే సరస్వతి కటాక్షం అవసరం. ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు.. ఎంతటి ఉపద్రవం నుంచైనా గట్టుక్కవచ్చని తెనాలి రామకృష్ణుడి కథల్లో కూడా పేర్కొన్నారు, సరస్వతి ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలతో స్తుతిస్తారు.
దేవీ నవరాత్రి ఉత్సవాల్లో మూల నక్షత్రం రోజున చదవుల తల్లికి పెద్దపీట వేస్తారు. చివరి 3 రోజులు మూల నక్షత్రం .. సప్తమి - సరస్వతి , అష్టమి - దుర్గా అష్టమి , నవమి - మహర్నవమి ... మూల నక్షత్రం రోజున సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు జరుపుతారు. లలితా సహస్రనామార్చన, సరస్వతి అష్టోతరం , కుంకుమార్చన , తెల్లని పువ్వులు లేదా కలువలతో సరస్వతి దేవిని పూజించాలి. పాయసం నైవేద్యంగా పెట్టాలి. పూజ తరువాత, మహా నివేదన తరువాత , సువాసిని పూజ అయిన తరువాత కలశానికి ఉద్వాసన చేయాలి.
నవరాత్రి ఉత్సవాల్లో మూల నక్షత్రం రోజున ( అక్టోబర్ 9) సరస్వతి అలంకారం చేస్తారు . తెల్లని పట్టు చీర కి ఎర్రని అంచు ఉన్న చీరను కడతారు. ముత్యాల హారం వేస్తారు. పాయసం , పండ్లు , పాలు, పేలాలు నివేదన చేయాలి. నువ్వులతో చేసిన లడ్డులు , వరి పేలాలు నివేదన విశేషం. తేన నివేదన చేయటం , వసతో (మాటలు వచ్చేందుకు శిశువుగా ఉన్నప్పుడు నాలికపై రాస్తారు) హోమం చేయలి. మాటలు రాని వారు వసతో హోమం చేయటం వలన మాటలు వచ్చే అవకాశం ఉంటుంది. వాక్ సిద్ధి కావాలి అనుకునే వాలు, పాండిత్యం రావాలి అనుకునే వాలు , జ్యోతిష్యం లో ప్రావీణ్యం కావలి అనుకునే వారు , సర్వజనులు సరస్వతి పూజ చేసుకోవాలి.సరస్వతి సూక్తం , సరస్వతి సహస్రనామాలు చదువుకోవటం , మేధో సూక్తం , సరస్వతి కవచం చదువుకోవటం మంచిది, పుస్తక రూపంలో సరస్వతి ని పూజ చేయాలి. మన ఇంట్లో ఉండే గ్రంథాలు రామాయణం , భాగవతం మొదలగు వాటికి పూజ చేయలి. చదువుకునేవారు పాఠ్య పుస్తకాలు.. పెన్నులు మొదలైనవి అమ్మవారి దగ్గర ఉంచాలి.
సరస్వతి వ్రతం ఎలా చేయాలి?
ముందుగా ఒక పీటపై తెల్లని వస్త్రాన్ని పరచి కొద్దిగా బియ్యం పోసి.. సరస్వతీ దేవి చిత్రపటాన్ని ప్రతిష్ఠించాలి. ( ఆనవాయితి ప్రకారం కలశం ఉంటే దానిని కూడా పెట్టుకోవాలి). అమ్మవారికి పటానికి ఇరువైపులా శంకు చక్రాలు.. గో పాదుకలు వేయాలి. కలశ పూజ చేసి.. సప్త నదులను ఆవాహన చేయాలి. అవకాశం ఉంటే అఖండ దీపారాధన చేస్తే మంచిది. ( కంపల్సరీ కాదు). అంటే మరుసటి రోజు వరకు కొండెక్కకుండాచూడాలి. అవకాశం లేకపోతే పూజ పూర్తయ్యేవరకు ఉంటే సరిపోతుంది.
మీకు శ్రీసూక్తం.. సరస్వతి సూక్తం వస్తే పారాయణ చేస్తే అభిషేకం చేయాలి. లేదంటే సరస్వతి విగ్రహంపై.. ఆవుపాలు.. కొబ్బరినీళ్లు.. నీళ్లు చల్లాలి, తరువాత పసుపు.. కుంకుమ.. గంధంతో అలంకరించి.. సరస్వతి దేవి అష్టోత్తర నామాలు చదువుతూ కుంకుమతో.. తెల్లని పూలతో పూజ చేయాలి. చదువుకునే పిల్లలతో పూజ చేయించాలి. విద్య ని అర్జించే వారు సర్వ జనులూ సరస్వతిని పూజ చేయాలి. అయితే సరస్వతి అనుగ్రహం కావాలి అనుకునే వారు శాంతంగా ఉండడం, సత్వ గుణం తో ఉండడం , శాంత చిన్తులయి ఉండాలి. కోపం , ద్వేషం , క్రోధం లేకుండా ఉండాలి. " ఓం శ్రీ సరస్వతీ దేవ్యే నమః " అని వ్రాసి అమ్మవారి జపం చేస్తే అమ్మవారి అనుగ్రహం పొందుతారని పండితులు చెబుతున్నారు.