దేశవాళీ క్రికెట్ లో సెంచరీల మీద సెంచరీలు.. వేలకొద్దీ పరుగులు.. ప్రతి సీజన్ లో టాప్ స్కోరర్.. ఇది చివరి నాలుగేళ్లుగా సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్ విధ్వంసం. ప్రతిష్టాత్మకమైన రంజీ పరుగుల వరద పారిస్తున్నా.. టీంఇండియాలో చోటు మాత్రం దక్కించుకోలేకపోయాడు . అయితే ఎట్టకేలకు స్వదేశంలో ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు ఛాన్స్ దక్కించుకున్నాడు. కోహ్లీ వ్యక్తిగత కారణాలతో దూరం కావడం.. రాహుల్, అయ్యర్ గాయపడటంతో.. రాజ్ కోట్ లో నేడు (ఫిబ్రవరి 15) జరుగుతున్న మూడో టెస్ట్ ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకున్నాడు.
జాతీయ జట్టులో స్థానం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సర్ఫరాజ్ ఖాన్ నిరీక్షణకు తెర పడింది. గురువారం (ఫిబ్రవరి 15) రాజ్‌కోట్ టెస్ట్ ప్రారంభానికి ముందు 25 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ కు అనిల్ కుంబ్లే తన తొలి టెస్ట్ క్యాప్‌ను అందజేశాడు. ఈ క్షణాన్ని దగ్గరుండి చూసిన సర్ఫరాజ్ కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తొలి సారి చోటు దక్కించుకునేసరికీ అతని తండ్రి, భార్య ఇద్దరూ కన్నీళ్లు అదుపు చేసుకోలేకపోయారు. రెండో టెస్టులో రాహుల్ కు గాయం కావడంతో జట్టులో సెలక్టయిన సర్ఫరాజ్.. రజత్ పటిదార్ ఉండటంతో తన తొలి టెస్ట్ కోసం ఎదురు చూడాల్సి వచ్చింది.
Also Read: రోహిత్ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ బరిలోకి
మూడో టెస్టుకు ముందు రాహుల్, అయ్యర్ ఇద్దరూ కోలుకోకపోవడంతో సర్ఫరాజ్ కు తుది జట్టులో ఛాన్స్ వచ్చింది. 45 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో సర్ఫరాజ్ 69.85 సగటుతో 3912 పరుగులు చేశాడు. వీటిలో 14 సెంచరీలు, 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇటీవలే ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లలో ఇండియా A తరపున మొదటి అనధికారిక టెస్ట్‌లో 50 పరుగులు చేశాడు. ఇదే సిరీస్ లో 161 పరుగులు భారత జట్టులోకి ఎంపికయ్యాడు.
What an emotional moment for Sarfaraz Khan's father and wife. ? pic.twitter.com/pDobnH1x0t
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 15, 2024