మాంగళ్యలో సందడిగా శారీ డ్రాపింగ్

మాంగళ్యలో సందడిగా శారీ డ్రాపింగ్

ఎల్బీనగర్, వెలుగు: వనస్థలిపురంలోని మాంగళ్య షాపింగ్​మాల్​లో మొదటిసారి శుక్రవారం శారీ డ్రాపింగ్(చీర కట్టడం) నిర్వహించారు. తమిళనాడులోని చెన్నైకు చెందిన ప్రముఖ శారీ డ్రాపర్ కవిత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. 

యువతులు, మహిళల చీరకట్టు ఎలా ఉండాలి అనే విషయాన్ని వివరించారు. సిటీలోని ఫ్యాషన్ డిజైనర్లు, బ్యూటీ పార్లర్ నిర్వాహకులు, స్థానిక మహిళలు ఆసక్తికరంగా గమనించారు. మాంగళ్య షాపింగ్ మాల్ చైర్మన్ కాసం నమ:శివాయ, డైరెక్టర్లు కాసం శివ, పుల్లూరు అరుణ్, తోనూపునూరి అరుణ్ పాల్గొన్నారు.