మెరిట్, ఖాళీల ఆధారంగానే గురుకులాల్లో అడ్మిషన్లు

మెరిట్, ఖాళీల ఆధారంగానే గురుకులాల్లో అడ్మిషన్లు
  • సెట్ కన్వీనర్, ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి

హైదరాబాద్, వెలుగు: గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలను ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో వచ్చిన మార్కులు, ఖాళీల ప్రకారం భర్తీ చేస్తామని సెట్ కన్వీనర్, ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి తెలిపారు. అడ్మిషన్ పొందిన విద్యార్థులకు వారు రిజిస్టర్ చేసుకున్న ఫోన్​కు ఎస్ ఎంఎస్ వస్తుందని, పాఠశాల ప్రిన్సిపాల్ కూడా అధికారికంగా సమాచారం ఇస్తారని తెలిపారు. ఈ అంశంపై స్టూడెంట్స్, పేరెంట్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మెరిట్ లిస్ట్ / సెలక్షన్ లిస్ట్ ను ఎస్సీ గురుకుల అధికారిక వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచినట్టు మంగళవారం తెలిపారు.

ఈ వెబ్ సైట్ లో ఉంచిన మెరిట్ లిస్టును మాత్రమే అధికారిక మెరిట్ లిస్ట్ గా పరిగణించాలని, ఇతరులు, సొసైటీకి సంబంధంలేని వెబ్ సైట్​లు, అనధికారిక లిస్టులను చూపిస్తే మోసపోవద్దన్నారు. ఆయా పాఠశాలలో ఖాళీలను బట్టి విద్యార్థులకు ఫేజ్ 1, ఫేజ్ 2 తర్వాత దశలవారీగా సీట్లను కేటాయిస్తామన్నారు.